Bigg Boss Agnipariksha2: మరో మూడు రోజుల్లో కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ మొదలు కాబోతుంది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పుడు లేనంత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో పాటుగా , ఈ సీజన్ ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్లే ఇంత ‘బిగ్ బాస్ 10 ‘ కోసం ఎదురు చూస్తున్నారు. ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ ఎపిసోడ్స్ కి నెగెటివిటీ భారీగా ఏర్పడింది కానీ, ఆ తర్వాతి ఎపిసోడ్స్ కి మాత్రం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండర్ రేటెడ్ ప్లేయర్స్ అందరూ ఒక్కో రోజు షైన్ అవుతూ వచ్చారు.
ఇది ఇలా ఉండగా ‘అగ్ని పరీక్ష 2’ లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో నేటి ఎపిసోడ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ లో నవరసాల మామ, అలియాస్ రామకృష్ణ తన తోటి కంటెస్టెంట్స్, యాంకర్ శ్రీముఖి, జడ్జీలనే కాదు, ప్రేక్షకుల చేత కూడా కంటతడి పెట్టించాడు. ఎల్లో కార్డు ని సొంతం చేసుకున్న రామకృష్ణ , భాగీ లలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చెయ్యాలని, అది కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఉంటుందని చెప్తారు. కంటెస్టెంట్స్ అందరూ అత్యధిక శాతం రామకృష్ణ ని ఎలిమినేట్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఇక ఎలిమినేట్ అయిపోయానని అనుకున్న రామకృష్ణ, ఆ తర్వాత తనలోని ఎమోషన్ ని బయట పెడుతూ మాట్లాడిన కొన్ని మాటలు అందరి గుండెల్ని పిండేసాయి.
ఈ ఒక్క స్పీచ్ తో రామ కృష్ణ ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఫిక్స్ చేసుకున్నాడు అనొచ్చు. అంత అద్భుతంగా మాట్లాడాడు. అయితే చివరి నిమిషం లో జడ్జీలు ట్విస్ట్ ఇస్తూ , మేము కేవలం మీ అభిప్రాయం మాత్రమే అడిగాము. నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పి, రామకృష్ణ ని సేఫ్ చేసి , భాగీ ని ఎలిమినేట్ చేశారు.అయితే రామకృష్ణ మాట్లాడిన మాటలకు భాగీ కూడా బాగా ఏడ్చేస్తుంది. ఇందులో రామకృష్ణ మాట్లాడిన కొన్ని మాటలు ప్రేక్షకులు ఎప్పటికీ అలా గుర్తించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘నేను మీ అందరి కంటే బెస్ట్ కాదు , ఒప్పుకుంటాను, కానీ కచ్చితంగా నేను కూడా బెస్ట్ నే, కాకపోతే మీ అంత కాదు’ అని చెప్పుకొని ఏడ్చేస్తాడు. ఇది వింటే ఎలాంటి వారికైనా ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ కి కచ్చితంగా రావాల్సిందే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.