Panja Re Release: పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చిన చిత్రం ‘పంజా’. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అప్పట్లో భారీ అంచనాలు ఉండడం వల్ల, ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గా జరిగింది. డిజాస్టర్ టాక్ రావడం వల్ల, వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఆరోజుల్లోనే నిర్మాతకు పాతిక కోట్ల రూపాయిలు నష్టం జరిగింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ డిజాస్టర్ అనేది. అయితే ఆ తర్వాత కాలక్రమేణా ఈ సినిమాకు జెన్ జీ ఆడియన్స్ లో బాగా క్రేజ్ పెరిగింది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.
దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఫ్లాప్ సినిమాల రీ రిలీజ్ లకు జనాలు కదలరు. అభిమానులు కూడా చాలా తక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ పంజా కి మాత్రం వేరే లెవెల్ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా జెన్ జీ యూత్ ఆడియన్స్ నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ చుట్టూనే తిరిగారు అంటే అతి సయోక్తి కాదేమో. అలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ రీ రిలీజ్ , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , సీడెడ్ నుండి 40 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 30 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 20 లక్షలు వచ్చాయి.
అదే విధంగా కృష్ణా జిల్లా నుండి ఈ చిత్రానికి 27 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, గుంటూరు జిల్లా నుండి 20 లక్షలు , ఈస్ట్ గోదావరి 16 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 9 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 62 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుండి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రీమియర్ షోస్ గ్రాస్ తో కలిపి 5 కోట్ల 12 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.