Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: మెగాస్టార్, సూపర్ స్టార్ లపై కొడాలి నాని గౌరవం!

Kodali Nani: మెగాస్టార్, సూపర్ స్టార్ లపై కొడాలి నాని గౌరవం!

Kodali Nani: రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలా ఉంటారు. లేకుంటే మరోలా మారిపోతారు. ఇది అన్నిచోట్ల జరిగేది కూడా. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి. వైసిపి మాజీమంత్రి కొడాలి నాని అయితే అధికారంలో ఉంటే ఏ స్థాయిలో దూకుడు కనబరిచే వారో తెలియంది కాదు. మీడియా ముందుకు వస్తే చాలు ప్రత్యర్థులను ఏకవచనంతో సంబోధిస్తూ.. బొచ్చు, పకోడీ, ఏం పీకుతారు, చచ్చు వెధవలు ఇలాంటి పదప్రయోగం చేసేవారు. ఇప్పుడు మాత్రం ప్రత్యర్థి నేతల పేర్లు చివర […]

Kodali Nani: రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలా ఉంటారు. లేకుంటే మరోలా మారిపోతారు. ఇది అన్నిచోట్ల జరిగేది కూడా. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి. వైసిపి మాజీమంత్రి కొడాలి నాని అయితే అధికారంలో ఉంటే ఏ స్థాయిలో దూకుడు కనబరిచే వారో తెలియంది కాదు. మీడియా ముందుకు వస్తే చాలు ప్రత్యర్థులను ఏకవచనంతో సంబోధిస్తూ.. బొచ్చు, పకోడీ, ఏం పీకుతారు, చచ్చు వెధవలు ఇలాంటి పదప్రయోగం చేసేవారు. ఇప్పుడు మాత్రం ప్రత్యర్థి నేతల పేర్లు చివర గారు అని ప్రయోగిస్తున్నారు. ఇదంతా అధికార మార్పిడి పుణ్యమే. కేసుల భయం పుణ్యమే. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అయితే అప్పటి కొడాలి నాని కి..ఇప్పటి కొడాలి నాని కి ఎంతో తేడా కనిపిస్తోంది. నిన్ననే చిరంజీవి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై గొప్ప మాటలు చెప్పారు కొడాలి నాని. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* అప్పట్లో పకోడీ అంటూ వ్యాఖ్యలు..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలో సరైన గౌరవం లభించలేదు అనేది ఒక వాదన. మరో సందర్భంలో చిరంజీవి ఏదో అంశంలో రాజకీయంగా బయటకు వచ్చారు. ఆ సమయంలో వీర విహారం చేశారు కొడాలి నాని. చిరంజీవిని పకోడీ గాడు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అవి విపరీతంగా వైరల్ కావడంతో తాను అలా అనలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానుల ద్వారా పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది అని అప్పట్లో వెనక్కి తగ్గారు. అయినా సరే చిరంజీవి పట్ల గౌరవించిన దాఖలాలు అప్పట్లో కనిపించలేదు. అంతెందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యారు. ఎన్టీఆర్ గొప్పతనంతో పాటు తన స్నేహితుడు చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన కొడాలి నాని కనీసం తమిళ సూపర్ స్టార్ అని గుర్తించకుండా రజనీకాంత్ శరీర ఆకృతిపై కూడా మాట్లాడారు. ఆయన ఒక హీరోనా అంటూ చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు.

* మారిన అభిప్రాయం..
అయితే అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. అందునా రాజకీయంలో ఉన్నవారు అంతలా దిగజారి పోతారు కూడా. అందుకే ఇప్పుడు కొడాలి నాని చిరంజీవి జన్మదిన వేడుకలకు హాజరై ఆయన సినీ పరిశ్రమకు పెద్ద దిక్సూచి అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి లాంటి గొప్ప మనిషి అంటూ ఆయన సేవలను కొనియాడారు. అందులో తప్పులేదు కానీ పకోడీ అంటూ అదే మెగాస్టార్ చిరంజీవిని వ్యాఖ్యానించడం చాలా తప్పు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ గొప్ప గుర్తింపు సాధించుకున్నారు రజినీకాంత్. ఆయనను సైతం చాలా తక్కువ చేసి మాట్లాడారు కొడాలి నాని. అటువంటి నాని తప్పు తెలుసుకుని ఇప్పుడు గొప్పగా మాట్లాడుతుండడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సమయంలో మెగాస్టార్ ను పొగిడినందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి చివాట్లు పెట్టడం ఖాయం అని సెటైర్లు పడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper