Homeఎంటర్టైన్మెంట్Nani Paradise Movie: ప్యారడైజ్ మూవీలో చిలుకలు, పావురాలు, కాకుల మధ్య చూపించబోయే తేడా ఇదేనా..?

Nani Paradise Movie: ప్యారడైజ్ మూవీలో చిలుకలు, పావురాలు, కాకుల మధ్య చూపించబోయే తేడా ఇదేనా..?

Nani Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. […]

Nani Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి కొత్త ఇమేజ్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమాని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి గ్లింప్స్ లో చిలకలు, పావురాల గురించి విన్నాం కానీ కాకుల గురించి ఎవ్వరు రాయలేదు అంటూ ఒక ఒక డైలాగ్ ను హైలెట్ చేశారు. మరి ఆ డైలాగులను బట్టి చూస్తే మోహన్ బాబు మాలిక్ అనే విలన్ క్యారెక్టర్ లో చేస్తున్నాడు. కాబట్టి చిలకను రిప్రజెంట్ చేస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇచ్చారు.

అలాగే మోహన్ బాబు కొడుకు విక్రమ్ మాలిక్ పాత్రను చేస్తున్న వ్యక్తి ది కూడా పావురం ఇన్స్పిరేషన్తో ఫస్ట్ లుక్ ఇచ్చారు. వీళ్ళందరినీ ఎదురుకోవడానికి కాకులు లాంటి మన హీరో టీమ్ కసరతులు చేశాయి. వాళ్ళమీదకి ఎలా అటాక్ చేశాయి. వాళ్ళని ఎలా ఓడించాయి అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.

నాని ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నింటిలో ఓవర్ హైప్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఇక ఈ సినిమా మీద సగటు ప్రేకగ్కులు సైతం మంచి అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది లేదని మీద క్లారిటి రావడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper