Ram Charan Health Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి నిన్న తమిళనాడు కోయంబత్తూర్ లోని గంగ హాస్పిటల్స్ లో తన మణికట్టుకి సర్జరీ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘పెద్ది’ మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్ మణికట్టుకి గాయం జరిగింది. అప్పుడే డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలని సూచించినప్పటికీ , షూటింగ్ ఆలస్యం అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో ఆయన సర్జరీ నిరాకరించారు. తీవ్రమైన నొప్పితోనే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారు. అయితే రామ్ చరణ్ కి నిన్న ఇలా సర్జరీ జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. కాసేపటి క్రితమే ఆయన హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పై కాసేపటి క్రితమే ‘పెద్ది’ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘పెద్ది సినిమా షూటింగ్ సమయం లో రామ్ చరణ్ గారి మణికట్టు కి తగిలిన తీవ్ర గాయాలకు నేడు సర్జరీ చేయించుకోవడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మణికట్టు గాయం తో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా , పెద్ది సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆయన కమిట్మెంట్ , డెడికేషన్ , కష్టపడే తత్త్వం మా అందరికీ ఆదర్శప్రాయం. రీసెంట్ గానే డాక్టర్లతో మేము సంప్రదించాము , ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే ఆయన సంపూర్ణవంతమైన ఆరోగ్యం తో మన ముందుకు రావాలని , ఎప్పటి లాగానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’ అంటూ ఒక లేఖని విడుదల చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ ని మీకోసం చివర్లో అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
‘రంగస్థలం’ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే లోపు ఆయన పూర్తి స్థాయిలో రీకవరీ అవ్వాలని చూస్తున్నారు. అభిమానులు కూడా చాలా బలంగా ప్రార్థనలు చేస్తున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది దసరా నుండి మొదలు కానుంది. మరి అప్పటి లోపు రామ్ చరణ్ కోలుకుంటారో లేదో చూడాలి.
A fighter on and off the screen ❤️
Wishing our beloved Mega Power Star @AlwaysRamCharan Garu a smooth and speedy recovery. pic.twitter.com/7hmeyE0QLm
— Vriddhi Cinemas (@vriddhicinemas) July 28, 2026