Homeజాతీయ వార్తలుAssam Floods: చుట్టుముట్టు వరదలు.. ఎదురుగా నాన్న.. అతడే కొండంత ధైర్యం.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

Assam Floods: చుట్టుముట్టు వరదలు.. ఎదురుగా నాన్న.. అతడే కొండంత ధైర్యం.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

Assam Floods: ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా సరే.. కోట్లాదిమంది శత్రువులుగా మారినా సరే.. పక్కనే తండ్రిగా ఉంటే వచ్చే ధైర్యం వేరు. అతడు ముందుంటే కలిగే స్థైర్యం వేరు. తండ్రి ఇచ్చే భరోసా.. తండ్రి కలిగించే నమ్మకం. తండ్రి చూపించే తోవ.. తండ్రి పెంపొందించే ధీమా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తండ్రి చేసే మేలు.. తండ్రి అందించే ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఇప్పటికే లక్షల […]

Assam Floods: ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా సరే.. కోట్లాదిమంది శత్రువులుగా మారినా సరే.. పక్కనే తండ్రిగా ఉంటే వచ్చే ధైర్యం వేరు. అతడు ముందుంటే కలిగే స్థైర్యం వేరు. తండ్రి ఇచ్చే భరోసా.. తండ్రి కలిగించే నమ్మకం. తండ్రి చూపించే తోవ.. తండ్రి పెంపొందించే ధీమా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తండ్రి చేసే మేలు.. తండ్రి అందించే ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది ఆవాసాలను కోల్పోయారు. నిలువనీడ లేక నరకం చూస్తున్నారు. వరదలు చుట్టుముట్టి జనాలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యావత్ దేశం మొత్తం వర్షాభావంతో ఇబ్బంది పడుతుంటే.. అస్సాం రాష్ట్రంలో మాత్రం విపరీతంగా వరదలు వస్తున్నాయి. నష్టం కూడా అధికంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

పెద్దవాళ్లు మాత్రమే కాదు.. చిన్నపిల్లల కూడా వరదలలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్రంలో వరదల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తన పిల్లలకు ఒక తండ్రి చేసిన త్యాగం కన్నీళ్లు పెట్టిస్తోంది. వరదలు చుట్టుముట్టిన సమయంలో.. తన పిల్లలను కాపాడుకోవడానికి ఒక తండ్రి ఏకంగా తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. పిల్లలను వరదనీటిలో మునిగిపోకుండా ఒక తెప్పలో కూర్చోబెట్టాడు. దానిని నెట్టుకుంటూ ముందుకు పోయాడు. పీకల లోతు వరద నీరు అతడిని చుట్టుముట్టినప్పటికీ.. వరద ప్రవాహం ఎక్కువగా వస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా.. అతడు తన పిల్లలను తెప్ప ద్వారా తోసుకుంటూ ముందుకు పోయాడు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఎవరో వస్తారని చూడక.. మొండి ధైర్యంతో తన పిల్లలను కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఆ తండ్రి ఓ యోధుడిలాగా తన పిల్లలకు అండగా నిలబడ్డాడు.

ఇటువంటి దృశ్యాలు అస్సాం వరదల్లో పరిపాటిగా మారిపోయాయి. కుటుంబ సభ్యులను.. కన్న పిల్లలను కాపాడుకోవడానికి తండ్రులు ముంచెత్తే వరదలను సైతం లెక్కచేయడం లేదు. వరద నీరు ప్రవాహాన్ని తట్టుకొని సైతం ముందుకు వెళ్తున్నారు. తద్వారా తండ్రి అనే పదానికి సిసలైన అర్థం చెబుతున్నారు.. సాధారణంగా తండ్రులను రియల్ హీరోలు అని పిలుస్తుంటారు. కానీ ఈ దృశ్యాలు చూచిన తర్వాత అంతకుమించిన పదాలు వెతుక్కోవాలని.. అంతకుమించిన గౌరవాన్ని ఇవ్వాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper