Homeఎంటర్టైన్మెంట్Ramayana Trailer: 'రామాయణం' ట్రైలర్ చూసి డైరెక్టర్ కి ఫోన్ చేసిన రాజమౌళి...ఒక తప్పు చేశారని...

Ramayana Trailer: ‘రామాయణం’ ట్రైలర్ చూసి డైరెక్టర్ కి ఫోన్ చేసిన రాజమౌళి…ఒక తప్పు చేశారని చెప్పిన జక్కన్న

Ramayana Trailer: రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యశ్ విలన్ గా నటిస్తున్న రామాయణం సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. నితీష్ తివారి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం… ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అసలు ఇది నిజంగానే అఫీషియల్ టీజరా లేదంటే కావాలని ఫ్యాన్ మేడ్ ఏదైనా చేశారా అనేంతలా ప్రేక్షకులు బ్రమపడే విధంగా ఆ టీజర్ ఉండడంతో సినిమా మీద […]

Ramayana Trailer: రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యశ్ విలన్ గా నటిస్తున్న రామాయణం సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. నితీష్ తివారి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం… ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అసలు ఇది నిజంగానే అఫీషియల్ టీజరా లేదంటే కావాలని ఫ్యాన్ మేడ్ ఏదైనా చేశారా అనేంతలా ప్రేక్షకులు బ్రమపడే విధంగా ఆ టీజర్ ఉండడంతో సినిమా మీద భారీగా నెగెటివ్ కామెంట్స్ వ్యక్తం అయ్యాయి. దాంతో చాలా జాగ్రత్తలు తీసుకొని ట్రైలర్ ను చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా కట్ చేశారు. ముఖ్యంగా విజువల్స్ సైతం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ ని చూసిన రాజమౌళి సైతం నితీష్ తివారి తనకు మంచి స్నేహితుడు కావడంతో అతనికి ఫోన్ చేసి మరి ట్రైలర్ బాగుంది. కానీ అందులో ఒకటి రెండు చేంజెస్ చేసి ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండేదని తనకు తోచిన కొన్ని సజెషన్స్ చెప్పారట.

ఇక అందులో భాగంగానే ఆ ట్రైలర్లో హనుమంతుడికి సంబంధించిన ఒక విజువల్ ని వేసుంటే టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దానిమీద నితీష్ తివారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారట. అయినప్పటికి రాజమౌళి చెప్పిన విషయం మాత్రం చాలా మంచిదనే చెప్పాలి.

ఎందుకంటే చాలామంది హనుమంతుడికి భక్తులుగా ఉన్నారు. కాబట్టి ఒక్క షాట్ లో అతని రూపం కనిపించినా కూడా రిపీటెడ్ గా ట్రైలర్ ని ప్రేక్షకులు చూసే అవకాశం అయితే ఉండేది. అలాగే ప్రేక్షకుల్లో ఈ మూవీ మీద విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయ్యేది. అలా కాకుండా నెక్స్ట్ ట్రైలర్ కోసం హనుమంతుడిని దాచిపెట్టారు.

ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికి కాస్త ఎఫెక్టివ్ గా ఉండుంటే బాగుండేదనే అభిప్రాయాలను రాజమౌళి కూడా వ్యక్తం చేశారట. ఇక ఏదేమైనా కూడా రామాయణం ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనేది వాస్తవం… ఆయన చేస్తున్న వారణాసి సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందనే దాని మీద తొందరలోనే క్లారిటి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper