Homeఎంటర్టైన్మెంట్Ranbir Kapoor vs Mahesh Babu: రణబీర్ కపూర్ vs మహేష్ బాబు... రాముడిగా ఎవరు...

Ranbir Kapoor vs Mahesh Babu: రణబీర్ కపూర్ vs మహేష్ బాబు… రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…

Ranbir Kapoor vs Mahesh Babu: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ ఇండస్ట్రీ నుంచి సినిమాలు వచ్చినా కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆయన సినిమాలను చూసి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగిన వారే కావడం విశేషం…కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారికి భారీ […]

Ranbir Kapoor vs Mahesh Babu: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ ఇండస్ట్రీ నుంచి సినిమాలు వచ్చినా కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆయన సినిమాలను చూసి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగిన వారే కావడం విశేషం…కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారికి భారీ పరాజయాలైతే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఖాన్ త్రయం ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళ అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రన్బీర్ కపూర్ లాంటి నటుడు సైతం గతంలో సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో చేసిన అనిమల్ సినిమాతో 900 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన ‘నితీష్ తివారి’ దర్శకత్వంలో ‘రామాయణం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తుండడం విశేషం…

ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సైతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో రాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. రన్బీర్ కపూర్ రాముడిగా ఎలా ఉండబోతున్నాడు అనేదానికి ఒక క్లియర్ కట్ విజన్ అయితే మనకు ట్రైలర్ రూపంలో చూపించారు.

సినిమాలో మహేష్ బాబు రాముడి గెటప్ లో ఎలా ఉంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి లుక్స్ పరంగా ఇద్దరూ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నప్పటికి రాముడి క్యారెక్టర్ కి ఎవరు బాగా సెట్ అవుతారు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

దీపావళి కానుకగా నవంబర్ నెలలో ‘రామాయణం’ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అలాగే వారణాసి సినిమా మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండు సినిమాలు రిలీజ్ అయితే గాని రాముడి పాత్రలో ఎవరు అలరించారు ఎవరు మెప్పించలేకపోయారు అనేది క్లారిటీ గా తెలిసే అవకాశమైతే లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper