Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Birthday Surprise: ఒకటి కాదు.. ఏకంగా రెండు.. పుట్టిన రోజు కానుకగా చిరంజీవి అభిమానులకు...

Chiranjeevi Birthday Surprise: ఒకటి కాదు.. ఏకంగా రెండు.. పుట్టిన రోజు కానుకగా చిరంజీవి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్..

Chiranjeevi Birthday Surprise: తన ప్రతీ పుట్టినరోజుకి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ని ఇవ్వడం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్. తన కొత్త సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు, ఏదైనా సేవా కార్యక్రమాలను ప్రారంభించడం, లేదా ఎదో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం వంటివి చేస్తుంటారు మెగాస్టార్. ఈ పుట్టిన రోజుకి కూడా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి […]

Chiranjeevi Birthday Surprise: తన ప్రతీ పుట్టినరోజుకి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ని ఇవ్వడం మెగాస్టార్ చిరంజీవి స్పెషల్. తన కొత్త సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు, ఏదైనా సేవా కార్యక్రమాలను ప్రారంభించడం, లేదా ఎదో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం వంటివి చేస్తుంటారు మెగాస్టార్. ఈ పుట్టిన రోజుకి కూడా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం కాబట్టి, ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు బాబీ. జెట్ స్పీడ్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియో ని వచ్చే నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ee చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్ ని లాక్ చేశారట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆగస్టు 22 న ఇదే టైటిల్ ని రివీల్ చేస్తారా?, లేదా వేరే ఏదైనా టైటిల్ ని రివీల్ చేస్తారా అనేది చూడాలి. ఇకపోతే ee చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి మిడిల్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఆయనకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటిస్తోంది. హీరోయిన్ నివేత పేతు రాజ్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం అప్డేట్ తో పాటు మరో క్రేజీ అప్డేట్ ని కూడా చిరంజీవి పుట్టినరోజు నాడు రివీల్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , క్వాలిటీ VFX వర్క్ కోసం అత్యధిక సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆ కారణం చేత మేకర్స్ ఇప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 న విడుదల చెయ్యాలని అనుకున్నారట మేకర్స్. ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా , ఈ సినిమా విడుదల తేదీతో కూడిన సరికొత్త గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు అట. త్వరలోనే ఈ రెండు అప్డేట్స్ సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper