Homeఅంతర్జాతీయంIran China Missile Launchers: ఇరాన్‌కు చైనా మిసైల్‌ లాంచర్లు.. వయా పాకిస్తాన్.. అమెరికాకు షాక్...

Iran China Missile Launchers: ఇరాన్‌కు చైనా మిసైల్‌ లాంచర్లు.. వయా పాకిస్తాన్.. అమెరికాకు షాక్ లగా..

Iran China Missile Launchers: ఇరాన్‌–అమెరికా యుద్ధం మళ్లీ ఉధృతమవుతోంది. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. శాంతి ఒప్పందాన్ని రెండు దేశాలు చెత్తబుట్టలో వేశాయి. డీల్‌ తర్వాత అమెరికా ఇరాన్‌పై దాడులు ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌ ప్రాక్సీ గ్రూపులు కూడా యాక్టివ్‌ అయ్యాయి. ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ కూడా ఇరాన్‌ లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ మీడియాలో వచ్చిన ఇటీవలి నివేదికలు మధ్యప్రాచ్యం, ఆసియా […]

Iran China Missile Launchers: ఇరాన్‌–అమెరికా యుద్ధం మళ్లీ ఉధృతమవుతోంది. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. శాంతి ఒప్పందాన్ని రెండు దేశాలు చెత్తబుట్టలో వేశాయి. డీల్‌ తర్వాత అమెరికా ఇరాన్‌పై దాడులు ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌ ప్రాక్సీ గ్రూపులు కూడా యాక్టివ్‌ అయ్యాయి. ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ కూడా ఇరాన్‌ లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ మీడియాలో వచ్చిన ఇటీవలి నివేదికలు మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంతాల్లో కొత్త చర్చలను రేకెత్తిస్తున్నాయి. అమెరికాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాల సరఫరా జరుగుతోందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ప్రాంతీయ సంబంధాలు, అంతర్జాతీయ శాంతి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ఇరాన్‌తో చైనా కీలక ఒప్పందం..
నివేదికల ప్రకారం చైనా–ఇరాన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో 400 మిస్సైల్‌ లాంచర్లు ఉన్నాయని, వాటి విలువ 60–70 మిలియన్‌ డాలర్ల మధ్య ఉందని సమాచారంం. ఈ సామగ్రి పాకిస్తాన్‌ మార్గం ద్వారా చేరుతుందని, ఇరాన్‌ మరో వారంలోపు తొలి విడత లాంచర్లను అందుకోనుందని తెలుస్తోంది. ఇటువంటి సమాచారం అమెరికాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో వస్తుండటంతో భౌగోళిక ప్రాధాన్యం పెరుగుతోంది.

ఖండించిన చైనా, పాకిస్తాన్‌..
ఈ ఆరోపణలపై చైనా స్పష్టంగా ఖండించింది. పాకిస్తాన్‌ కూడా తన ప్రమేయాన్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఇటువంటి అధికారిక ఖండనలు ఆరోపణల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికలు, ప్రభుత్వాల అధికారిక స్థానాల మధ్య వ్యత్యాసం ఉండటంతో సమాచార ధ్రువీకరణ అవసరం మరింత స్పష్టమవుతోంది.

ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావాలు
ఒకవేళ ఈ సరఫరా నిజమైతే అది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బయటి దేశాల ప్రమేయం ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో చైనా–ఇరాన్‌ సహకారం, పాకిస్తాన్‌ మార్గం వంటి అంశాలు ఆసియా–పసిఫిక్, దక్షిణాసియా సంబంధాలపై కూడా చర్చను రేకెత్తిస్తాయి. ఆయుధాల సరఫరా ఆరోపణలు తరచుగా దౌత్యపరమైన ఒత్తిడులకు, ఆర్థిక ఆంక్షలకు దారితీసే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే ఈ ఆరోపణలు కేవలం ఆయుధాల సరఫరా వార్త మాత్రమే కాదు. అవి ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో శక్తి సమతుల్యత, దౌత్య సంబంధాలు, సమాచార విశ్వసనీయతపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper