Rajamouli Upcoming Movies: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ చాలా మంది దర్శకులు సినిమాలను తొందరగా చేయడంలో చాలావరకు ఫెయిర్ అవుతున్నారు. సినిమా సినిమాకి మధ్య ఎక్కువగా గ్యాప్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.
Also Read: బాలయ్య బాబు సినిమాలో నటించడానికి భయపడి పోయిన స్టార్ హీరో…
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లు వరుస సినిమాలను చేయడంలో చాలావరకు వెనుకబడిపోతున్నారు. మంచి సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి సినిమా సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకోవడం అలవాటైపోయింది. మరి ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఒక్కడే సినిమాల కోసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటాడు అంటూ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నప్పటికి యంగ్ డైరెక్టర్లు కూడా ఆయన కంటే ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే రాజమౌళి సినిమాల్లో భారీ గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆయన ఎక్కువ సమయం తీసుకున్న పర్లేదు కానీ యాంగ్ డైరెక్టర్లు ఎందుకని ఎక్కువ రోజులు ఒక సినిమా కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుజిత్(Sujeeth) లాంటి స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటినప్పటికి కేవలం ఇప్పటివరకు ఆయన రెండు సినిమాలే చేశాడు.
ఇక సాహో సినిమా 2019వ సంవత్సరంలో వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఒక్క సినిమాను రిలీజ్ చేయలేదు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఒక సినిమాను కూడా రిలీజ్ చేయకుండా ఓజి సినిమా మీదనే తన పూర్తి టైమ్ ను కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడు… రాహుల్ సాంకృత్యాయన్ చేసిన శ్యాం సింగరాయ్ (Shyam Singaroy) సినిమా 2017 లో వచ్చింది. ఆ సినిమా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు మరొక సినిమా అయితే రిలీజ్ చేయలేదు…
ఇక రాజావారు రాణి గారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజ్ కిరణ్ కోలా సైతం ఇప్పటివరకు మరొక సినిమా రిలీజ్ చేయలేదు. ఈ సినిమా 2019లో వచ్చింది దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఒక సినిమా మీదనే తన టైమ్ ని స్పెండ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు…
ఇక యంగ్ డైరెక్టర్లందరు రాజమౌళి కంటే చాలా బద్దకస్తులుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందువల్లే వీళ్ళు సినిమా సినిమాకి భారీగా గ్యాప్ అయితే తీసుకుంటున్నారు. ఈ విషయంలో వీళ్ళతో పోలిస్తే రాజమౌళి ఒక వంతుకు బెటర్ అని కొంతమంది నెటిజన్లు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం…