LPG price reduction : విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. చుమురు కంపెనీలు తాజాగా వాణిజ అవసరాల కోసం ఉపయోగపడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. దేశచుమురు కంపెనీలు 19 కేజీలు ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 రూపాయలు మేర తగ్గించినట్లు ప్రకటించడం జరిగింది. 19 కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై రోజువారి కార్యకలాపాలతో ఆధారపడే హోటల్లో, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలకు తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఉపశమనం కలిగించాయి. ప్రతినెల 1వ తేదీన చుమురు కంపెనీలో గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గినట్లు తెలుస్తున్నాయి. తగ్గిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీ నగరంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,723.50, కోల్కత్తాలో రూ.1,826, ముంబై నగరంలో రూ.1,674.50, చెన్నై నగరంలో రూ.1,881, హైదరాబాద్ నగరంలో రూ.1,969 ఇక విజయవాడ నగరంలో రూ.1,880.50 గా ఉన్నాయి.
Also Read : రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
దేశంలో ఉన్న నగరాలను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయని తెలుసుకోవచ్చు. రాష్ట్రాలలో స్థానిక పన్నులు మరియు రవాణా ఖర్చులను బట్టి వీటి ధరలలో వ్యత్యాసం ఉంటుంది. వరుసగా మూడు నెలల నుంచి వాణిజ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతున్నాయి. చుమురు కంపెనీలో 9 కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలో మే నెల ప్రారంభంలో కూడా రూ.14.50 రూపాయలు తగ్గించాయి. అంతకుముందు గతంలో ఏప్రిల్ 1వ తేదీన కూడా చుమురు కంపెనీలు 9 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.41 తగ్గించడం జరిగింది.
ప్రతినెల తొలి రోజున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగానికి చెందిన సుమరు కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, వంట గ్యాస్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనా ధరలు మరియు విదేశీ మారకపో రేట్లలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులపై ఈ సవరణలు ఆధారపడి ఉంటాయని సమాచారం. అయితే గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్పిజి వంటగ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు జరగలేదు. గతంలో మార్చి నెలలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం రూ.50 రూపాయలు పెంచింది.