Homeఎంటర్టైన్మెంట్Prabhas: బాహుబలి రేంజ్ కాదట.. ప్రభాస్ ఫౌజీ చూడాలంటే.. ఫ్యాన్స్ ఆ పని చేయాలట..

Prabhas: బాహుబలి రేంజ్ కాదట.. ప్రభాస్ ఫౌజీ చూడాలంటే.. ఫ్యాన్స్ ఆ పని చేయాలట..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నిరాశపరిచినప్పటికీ.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ చిత్రం మీద అందరి దృష్టి ఉంది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరిగిపోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల విడుదల చేయడం లేదని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 418 పేరుతో ఒక సినిమాను నిర్మించింది. ఆ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. […]

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నిరాశపరిచినప్పటికీ.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ చిత్రం మీద అందరి దృష్టి ఉంది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరిగిపోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల విడుదల చేయడం లేదని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 418 పేరుతో ఒక సినిమాను నిర్మించింది. ఆ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు అంతగా బజ్ లేదు. పైగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది కాబట్టి.. దానిని భారీగానే ప్రమోట్ చేసుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు.. ప్రభాస్ ఫౌజీ సినిమాకు లింకు పెట్టింది మైత్రి మూవీ మేకర్స్. ప్రభాస్ బర్త్డే అక్టోబర్ 23 న ఫౌజీ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తామని మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవి వెల్లడించారు. దొంగ నా కొడుకు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ మాట చెప్పారు.

418 స్క్రీన్ అవుతున్న థియేటర్లలో మాత్రమే ప్రభాస్ ఫౌజీ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తారట. అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది.. కథ ఏంటి.. అనే విషయాలను చెబుతారట. కాకపోతే బాహుబలి రేంజ్ లో అభిమానులు ఊహించుకోకూడదు అట. జస్ట్ ఒక నార్మల్ సినిమా లాగానే చూడాలట. ఇది నార్మల్ సినిమా అయితే.. అలానే టికెట్ రేట్లు ఉంటాయా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గరికి నిర్మాతలు వెళ్ళరా.. టికెట్ మీద రేట్లు పెంచాలని కోరరా.. బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దు అనుకున్నప్పుడు.. మరి ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు.. రాజా సాబ్ విడుదలకు ముందు కూడా మారుతి ఇలానే వ్యవహరించారు. చివరికి సినిమా ఫలితం వేరే విధంగా రావడంతో మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ట్రీట్ అందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ అదే తప్పు చేస్తోందా.. అసలే ప్రభాస్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. రాజా సాబ్ సినిమా చేదు జ్ఞాపకం నుంచి ఇంతవరకు వారు కోలుకోలేదు. 2026 లో చాలామంది హీరోలు హిట్లు సాధించి.. గట్టి కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. పైగా వారు విపరీతమైన ఆకలితో ఉన్నారు. ఇలాంటి సమయంలో బాహుబలి లాంటి సినిమాను ఇస్తేనే వారి ఆకలి తీరుతుంది. అలా కాకుండా ఆ సినిమా అప్డేట్ విడుదల చేసేముందు 418 సినిమాతో లింక్ పెట్టడం.. పైగా బాహుబలి లాంటి సినిమా లాగా ఊహించుకోవద్దని చెప్పడం.. ప్రభాస్ అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper