Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ… ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ‘జై హనుమాన్’ అంటూ హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా ఒక సినిమా ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ని హనుమంతుడి పాత్ర కోసం తీసుకున్నాడు. అయినప్పటికి ఈ సినిమా ఇప్పటివరకు షూట్ స్టార్ట్ అవ్వలేదు. ఇక దానికి అనుగుణంగానే ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ గా మారాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దాంతో కొన్ని సినిమాలకు కథలను అందిస్తున్నాడు. మరికొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి ఇప్పుడు మహాకాళి, జై హనుమాన్ సినిమాలు వస్తున్నాయి. మరో రెండు మూడు సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ కి డైరెక్టర్ గా మంచి గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని వాడుకొని వరుస సినిమాలు చేయాల్సింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ తనూజ పై సెటైర్ల వర్షం కురిపించిన ‘బిగ్ బాస్ 8’ యష్మీ..వీడియో వైరల్!
అలా కాకుండా ప్రొడక్షన్ వైపు, అలాగే కథలను ఇతరులకు ఇచ్చే పనిని పెట్టుకుంటున్నారు. దీనివల్ల అతని కెరీర్ చాలా వరకు కోల్పోయే ప్రమాదమైతే ఉంది. ప్రస్తుతానికి డబ్బుల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆయన అలా చేస్తున్నప్పటికి డైరెక్టర్ గా ఒకసారి మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే తనకు గొప్ప అవకాశాలైతే వస్తాయి.
ప్రస్తుతం బాలయ్య బాబు కొడుకుతో చేయాల్సిన సినిమాని సైతం ప్రశాంత్ వర్మ పక్కన పెట్టేశాడు. దాంతో బాలయ్య బాబు ప్రశాంత వర్మ ను మందలించి ఆ ప్రాజెక్టుని తప్పించినట్టుగా తెలుస్తోంది. మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగితే ప్రస్తుతం ఉన్న దర్శకులతో పోటీ పడగలిగే కెపాసిటీ అతనికి ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు వెనుకబడిపోయో ప్రమాదం ఉంది…
చూడాలి మరి ప్రశాంత్ వర్మ ఇప్పటికైనా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతాడా? లేదంటే అదే ధోరణిలో ఇటు రైటర్ గా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఆయన చేసే సినిమాలతో డైరెక్టర్ గా గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. హనుమాన్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన జై హనుమాన్ సినిమాను స్టార్ట్ చేయలేదు… ఇక ఇలాగే వెళితే అతన్ని ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం కూడా ఉంది…