Rajasthan Principal: ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి. తాము పాఠాలు బోధించే పిల్లల్లో సొంత పిల్లలను చూసుకోవాలి. వారు సన్మార్గంలో నడిచే విధంగా క్రమశిక్షణను పెంపొందించాలి. పాటలతో పాటు జీవితంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు కూడా బోధించాలి. అప్పుడే పిల్లలు సన్మార్గంలో నడుస్తూ ఉంటారు.
వెనుకటి రోజుల్లో పిల్లలకు పాఠాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు ముందుగా క్రమశిక్షణ నేర్పించేవారు. పిల్లలు భయాన్ని.. గౌరవాన్ని పెంపొందించేవారు. పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలు సక్రమంగా ఉండే విధంగా చూసుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు దారి తప్పారు. విద్యా బోధనను ఒక ఉద్యోగం లాగానే చూస్తున్నారు. కొందరైతే విద్యాబోధన పక్కన పెట్టి చిట్టీలు.. పచ్చళ్ళు.. పట్టు చీరలు.. రియల్ ఎస్టేట్ అంటూ వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు ఉన్న బలమైన సంబంధం తెగిపోయింది. కొందరు ఉపాధ్యాయులు అయితే పిల్లలను ఆకోణంలో చూస్తున్నారు. ముఖ్యంగా కౌమార ఆడపిల్లలను వేరే విధంగా చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. పిల్లలను ఆ కోణంలో చూడడం.. వారితో చెప్పుకోలేని స్థాయిలో సంబంధాలను పెంచుకోవడం.. ఆ తర్వాత వారి మీద అకృత్యాలకు పాల్పడడం వంటి దారుణాలకు తెగబడుతున్నారు.
ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఆయన ఇప్పటికీ కొందరు ఉపాధ్యాయులు మారడం లేదు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్షలు వేస్తున్నప్పటికీ.. అటువంటివారు మారకపోగా.. మరింత తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులు అంటేనే సమాజం లో ఒక చులకన ఏర్పడుతోంది.
రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలకు చెందిన 11, 12వ తరగతి కౌమార పిల్లలను విహారయాత్రకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జలాశయంలో కళాశాల ప్రిన్సిపాల్ లాల్చంద్ మీనా ఆ పిల్లలతో కలిసి జలకాలు ఆడారు. కౌమార దశలో ఉన్న పిల్లలతో అతడు అలా చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. ఆ తర్వాత లాల్చంద్ మీనాను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పిల్లలను ఇలాంటి కోణంలో చూసేవాళ్లను విడిచిపెట్టొద్దని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.