Hanuman And Mirai: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ హీరోలు సైతం ఇక్కడ మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. తేజ సజ్జా లాంటి నటుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే హనుమాన్, మిరాయి లాంటి సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న తేజ సజ్జ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే తేజ సజ్జ దేవుడి పేరు చెప్పి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారంటూ కొంతమంది ఆయన మీద విమర్శలైతే చేస్తున్నారు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో హనుమంతుడు వచ్చే ఎపిసోడ్, మిరాయిలో రాముడు కనిపించే ఎపిసోడ్స్ ని తీసేస్తే సినిమాల్లో ఏముంది? అంత అదే రొటీన్ గా సాగే కథలే కదా అంటూ కొంతమంది ఆయన మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు.
ఆయన అందరికంటే డిఫరెంట్ గా ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జనాలను ఎంటర్ టైన్ చేయడానికి ఏదో ఒక ఎలిమెంట్ అయితే ఉండాలి. కాబట్టి ఆయన కూడా ఆ ఎలిమెంట్ ను పట్టుకొని ముందుకు సాగుతున్నాడు తప్ప అందులో అతన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏముంది? అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా తేజ సజ్జ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ముందు ముందు కూడా అలాంటి సినిమాలనే చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తానని ఆయన చెబుతుండడం విశేషం…
ప్రస్తుతం తేజ తో స్టార్ డైరెక్టర్లు సైతం సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన కొత్త సినిమాలను చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…