Homeఎంటర్టైన్మెంట్Prasanth Varma: ప్రశాంత్ వర్మ కాన్ఫిడెంట్ ఏంటి... ఎందుకని ఆయన ఖాళీగా ఉంటున్నాడు...

Prasanth Varma: ప్రశాంత్ వర్మ కాన్ఫిడెంట్ ఏంటి… ఎందుకని ఆయన ఖాళీగా ఉంటున్నాడు…

Prasanth Varma: హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ…ఆ తర్వాత ఆయన హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ అయితే బయటకు రావడం లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా? లేదా అనేది కూడా తెలియడం లేదు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుని పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకున్నారు. గతంలో […]

Prasanth Varma: హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ…ఆ తర్వాత ఆయన హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ అయితే బయటకు రావడం లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా? లేదా అనేది కూడా తెలియడం లేదు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుని పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకున్నారు. గతంలో రిషబ్ శెట్టి చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఆయన ఒక కండిషన్ పెట్టాడట. ఈ సినిమాకి డేట్స్ ఎంత కావాలి…ఎన్ని రోజులు పాటు డేట్స్ కేటాయించాలి అనే దానిమీద పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోమని చెప్పారట. మొత్తానికైతే రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం కేటాయించాడు. కొద్దిరోజుల పాటు షూటింగ్ జరిగింది. ప్రశాంత్ వర్మ ఎందుకని మళ్లీ సినిమా షూటింగ్ ఆపేసాడు.

కొద్ది రోజులపాటు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తే బాగుండేది కదా అని ఇంకొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హనుమాన్ సినిమా వచ్చి 3 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటికి ఆయన నుంచి మరో సినిమా రాకపోవడంతో అతని అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

తన తోటి దర్శకులందరు సినిమాలను చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలను చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటుంటే ప్రశాంత్ వర్మ మాత్రం రోజురోజుకీ లేట్ అయిపోతున్నాడు. ఇప్పటికే ఆయన చాలామంది హీరోలకి కథలను వినిపిస్తున్నప్పటికి అవేవీ కూడా పట్టా లెక్కకపోవడంతో ఆయన ఎందుకని ఇలా చేస్తున్నాడు.

అతని కాన్ఫిడెంట్ ఏంటి దర్శకుడిగా రాణిస్తేనే కదా అతను ఇండస్ట్రీలో కొనసాగేది. ఒకవేళ ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే ప్రమాదం ఉందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుంటడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వీలైనంత తొందరగా ఆయన సినిమాలు చేయాలి. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper