Varanasi Movie Hanuman: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదరణ దక్కుతోంది. కారణం ఏంటి అంటే ఆ సినిమాలో ఉన్న హీరోగాని, దర్శకుడుగాని అంతకు ముందు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించడం వల్ల ఎక్కువ హైప్ ని క్రియేట్ చేసుకుంటారు. దాని వల్ల ఇప్పుడు వాళ్ల నుంచి రాబోయే సినిమాని చూడడానికి చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి తో చేస్తున్న సినిమా విషయంలో ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించిన రాజమౌళి ఈ ఈవెంట్లో సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. దాంతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు… ఇక ఈ సినిమా సైన్స్, చరిత్ర, పురాణాలను బేస్ చేసుకొని ఉండబోతుందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ రాజమౌళి క్లారిటీగా చెప్పేశాడు. 30 నిమిషాల పాటు సాగే ఈ పాత్రలో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటించినట్టుగా ఆయన చెబుతుండడం విశేషం… ఇక రాముడు ఉన్నాడు అంటే ఈ సినిమాలో హనుమంతుడు కూడా ఉంటాడు. అతనికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో హనుమంతుని పాత్ర కోసం ఎవరిని తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి రాముడు గా మహేష్ బాబు నటిస్తుంటే హనుమంతుడి పాత్రలో నటించే నటుడు కూడా చాలా కీలకమైన నటుడు కావాలనే ఉద్దేశంతో రాజమౌళి ఒక నటుడిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ క్యారెక్టర్ లో కన్నడ నటుడు అయిన సుదీప్ నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తనతో చర్చలు జరిపిన రాజమౌళి ఫైనల్ గా అతని లుక్ ను కూడా టెస్ట్ చేసి అతను ఫిక్స్ అయినట్టుగా కన్ఫామ్ చేసుకున్నాడు. ఇక తొందరలోనే ఆయనకు సంబంధించిన షూట్ ని కూడా చేపట్టే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ పరంగా చూసిన కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ ఒక్క నటుడు కూడా లేడు కాబట్టి అందుకే సుదీప్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
అతని మార్కెట్ పరంగా చూసిన, నటన పరంగా చూసిన సినిమాకి బాగా హెల్ప్ అవుతాడు అనే ఉద్దేశంతోనే రాజమౌళి అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక హనుమంతుని పాత్ర కూడా ఈ సినిమాకి చాలా కీలకంగా మారబోతుందట. ఇక హనుమంతుని పాత్ర ఏం చేయబోతోంది. అసలు సినిమా ద్వారా రాజమౌళి ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…