Homeఎంటర్టైన్మెంట్Prabhas Spirit Movie: జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న 'స్పిరిట్' షూటింగ్.. ఇప్పటి వరకు ఎంత...

Prabhas Spirit Movie: జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న ‘స్పిరిట్’ షూటింగ్.. ఇప్పటి వరకు ఎంత శాతం పూర్తి అయ్యిందంటే..

Prabhas Spirit Movie: పాన్ ఇండియా హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ అంత వేగంగా ఏ హీరో కూడా సినిమాలు చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏడాది ఈయన ద్వారా వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల అయ్యేలా చూస్తాడు ప్రభాస్. గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు కానీ , ఈ ఏడాది మాత్రం ఆయన నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి కానుకగా […]

Prabhas Spirit Movie: పాన్ ఇండియా హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ అంత వేగంగా ఏ హీరో కూడా సినిమాలు చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏడాది ఈయన ద్వారా వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల అయ్యేలా చూస్తాడు ప్రభాస్. గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు కానీ , ఈ ఏడాది మాత్రం ఆయన నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి కానుకగా ‘రాజా సాబ్’ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 180 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ 3 న ఆయన నుండి ‘ఫౌజీ’ అనే చిత్రం విడుదల కాబోతుంది. హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ పై యూత్ ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానుల్లోనూ , ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సునామీ నే క్రియేట్ అవుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పుడే 70 శాతం కి పైగా పూర్తి అయ్యిందని , కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని , వచ్చేనెల రెండవ వారం లోపు టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. సందీప్ వంగ ఈ చిత్రాన్ని తన కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న సినిమాగా ‘స్పిరిట్’ ని నిలబోతున్నారు అట. ప్రభాస్ కూడా నాన్ స్టాప్ గా ఈ సినిమాని పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం ‘ఫౌజీ’ విడుదలైన మూడు నెలల గ్యాప్ లోనే రాబోతుంది. అంటే ‘ఫౌజీ’ చిత్రం పై గట్టి ప్రభావమే ఓపెనింగ్స్ లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఇప్పటి వరకు ‘ఫౌజీ’ పై ఎలాంటి అంచనాలు , హైప్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి. స్పిరిట్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరగడం చూస్తుంటే , ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని మార్చి 5, 2027 న విడుదల చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ చెప్పిన సమయానికి ఈ సినిమా విడుదలైతే మాత్రం ఓపెనింగ్స్ కలలో కూడా ఊహించని రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా వారణాసి కి కూడా కష్టమయ్యే నంబర్స్ ఈ సినిమాకు నమోదు అవుతాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper