Homeఎంటర్టైన్మెంట్Spirit Movie: 'స్పిరిట్' చిత్రం లో పవన్ కళ్యాణ్ 'ఓజీ' సాంగ్.. సందీప్ వంగ...

Spirit Movie: ‘స్పిరిట్’ చిత్రం లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సాంగ్.. సందీప్ వంగ సరికొత్త ప్రయోగం..

Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో , అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ ‘వారణాసి’ కి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు ఓపెనింగ్స్ ఊహిస్తేనే […]

Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో , అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ ‘వారణాసి’ కి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు ఓపెనింగ్స్ ఊహిస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయ్. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వచ్చినా , అది బాగా వైరల్ అయిపోతుంది. ఇంతటి క్రేజ్ ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా చూడలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ‘స్పిరిట్’ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లోనే కాదు , పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

అదేమిటంటే ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ ట్రాక్ మ్యూజిక్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ OST ని ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో నెటిజెన్స్ వినియోగించారు. అందులో ‘ముంబై స్ట్రోమ్’ అనే మ్యూజిక్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిని ‘స్పిరిట్’ మూవీ లో ఒక సన్నివేశం లో ఉపయోగించాలని డైరెక్టర్ సందీప్ వంగ ఆలోచిస్తున్నట్టు సమాచారం. సందీప్ వంగ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ‘ఓజీ’ చిత్రం లోని ఈ ట్రాక్ ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ , ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఈ రెండు ఫ్యాన్ బేసుల మధ్య రిలేషన్ సోషల్ మీడియా లో కానీ , బయట కానీ చాలా గొప్పగా ఉంది.

కానీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ‘స్పిరిట్’ చిత్రానికి పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి సినిమాకు మొత్తం ఒరిజినల్ కంటెంట్ ఉండాలి కానీ , పక్క సినిమాకు సంబంధించిన కంటెంట్ ని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది, క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోతే హైప్ బాగా తగ్గిపోతుంది అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్స్ గా వివేక్ ఒబెరాయ్ , ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజున గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper