Prabhas And Allu Arjun: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే ప్రభాస్, అల్లు అర్జున్ లకు పాపం ఎంత కష్టమొచ్చింది, ఒకరేమో చంచల్ గూడ జైలుకి వెళ్తున్నారు , మరొకరు నాంపల్లి హైకోర్టు కి వెళ్తున్నారు. ఇలాంటి అరుదైన పరిస్థితి ఎప్పుడూ రాలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అంటే , సోమవారం రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విచారణ కోసం నాంపల్లి హై కోర్టు కి వెళ్తున్నాడు. మరి ప్రభాస్ కి ఏమైంది?, ఆయన ఎందుకు చంచల్ గూడ జైలుకు వెళ్తున్నాడు?, అసలు ఏమి జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ చంచల్ గూడ జైలుకు వెళ్తున్నది నిజ జీవితం లో నేరం చేసి కాదు, ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ కోసం.
సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలో హైలైట్ గా నిలిచే జైలు సన్నివేశాలను రేపటి నుండి తెరకెక్కించబోతున్నారు. సుమారుగా వారం రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ , ప్రకాష్ రాజ్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు నాడు, సందీప్ వంగ ఒక ఆడియో టీజర్ ని విడుదల చేశారు గుర్తుందా?, అందులో జైలు సీక్వెన్స్ కి సంబంధించిన సంభాషణలే ఉంటాయి. చివర్లో ప్రభాస్ నాకు ఒక ‘బ్యాడ్ హ్యాబిట్’ ఉంటూ అంటూ చెప్పే డైలాగ్ సెన్సేషన్ అయ్యింది. ఆడియో వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇక సినిమాలో సందీప్ వంగ టేకింగ్ ఈ సన్నివేశాల్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మార్చి 7, 2027 న యాక్షన్ మూవీ లవర్స్ కి థియేటర్స్ లో మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతుంది ‘స్పిరిట్’ చిత్రం.
ఇక అల్లు అర్జున్ నాంపల్లి హైకోర్టు విచారణ విషయానికి వస్తే , సోమవారం రోజున కచ్చితంగా కోర్టుకి రావాల్సిందిగా హై కోర్టు ఆయనకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ , తాను రావడం కుదరదని , దానికి బదులుగా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ రూపం లో కోర్టుకి హాజరయ్యే వెసులుబాటు కల్పించాలని అల్లు అర్జున్ కోరారు. అయితే ఆయన రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన హై కోర్టు , కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో , అల్లు అర్జున్ ఈ సోమవారం రోజున హై కోర్టుకి రాబోతున్నాడు.
