Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' హౌస్ లోకి అర్థ రాత్రి దూసుకొచ్చిన...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి అర్థ రాత్రి దూసుకొచ్చిన పోలీసులు.. కంటెస్టెంట్స్ పరార్!

Bigg Boss 10 Telugu: అట్టహాసంగా భారీ అంచనాల నడుమ మొదలైన ‘బిగ్ బాస్ 10’ షో మొదటి ఎపిసోడ్ నుండే చాలా ఆసక్తికరంగా మారింది. 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టగా, అందులో 10 మంది చేతుల్లో పవర్ కీస్ పెట్టడం, ఆ పవర్ కీస్ రాబోయే రోజుల్లో చాలా కీలక పాత్ర పోషించబోతుండడం ఆసక్తికరమైన విషయం గా మారింది. అంతే కాకుండా మొదటి రోజు నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారా స్థాయిలో […]

Bigg Boss 10 Telugu: అట్టహాసంగా భారీ అంచనాల నడుమ మొదలైన ‘బిగ్ బాస్ 10’ షో మొదటి ఎపిసోడ్ నుండే చాలా ఆసక్తికరంగా మారింది. 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టగా, అందులో 10 మంది చేతుల్లో పవర్ కీస్ పెట్టడం, ఆ పవర్ కీస్ రాబోయే రోజుల్లో చాలా కీలక పాత్ర పోషించబోతుండడం ఆసక్తికరమైన విషయం గా మారింది. అంతే కాకుండా మొదటి రోజు నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ గా ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టం గా మారింది. ఎందుకంటే ఇరువైపులా గన్ షాట్ లాంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే టాస్క్ వేరే లెవెల్ లో ఉండనుంది.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీరంతా నిన్నటి ఎపిసోడ్ చివర్లో చూసే ఉంటారు. ఈ టాస్క్ ఆడేందుకు కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. ఒక టీం కి రోహిత్ లీడర్ కాగా, మరో టీం కి ఆటో రాంప్రసాద్ లీడర్. రోహిత్ టీం లో టెంపర్ వంశీ, షాలిని , అమన్, శ్రేష్టి , చరణ్ , చైత్ర వంటి వారు ఉంటారు. మిగిలిన వాళ్ళు రామ్ ప్రసాద్ టీం లో ఉంటారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లోకి కొంతమంది పోలీస్ రూపం లో వచ్చి కంటెస్టెంట్స్ పై దాడులు చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సస్పెన్స్.ఈ టాస్క్ లో ఆటో రాంప్రసాద్ టీం గెలిచినట్టు సమాచారం. రోహిత్ టీం ఓడిపోవడం తో , అతని టీం నుండి చరణ్ ఎలిమినేట్ అయ్యాడట. ఈ కారణం చేత చరణ్ డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

మరి రోహిత్ టీం ఎలా ఓడిపోయింది?, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడినా ఓడిపోయారా?, లేదంటే సరిగా ఆడలేక ఓడిపోయారా?, ఒకవేళ రోహిత్ టీం లీడర్ గా విఫలమైతే , అతని గ్రాఫ్ కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ లో రోహిత్ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. ఈ టాస్క్ లో ఒకవేళ త్రిగున్ , ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు అద్భుతంగా ఆడుంటే, కచ్చితంగా వీరిలో ఎవరో ఒకరు రోహిత్ కి ఓటింగ్ లో టఫ్ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఒక్క టాస్క్, కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ లో మార్పులు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper