Redmi Note 17 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త Redmi Note 17 Pro సిరీస్‌ను భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. కొత్త సిరీస్‌లో రెండు మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో Redmi Note 17 Pro, Redmi Note 17 Pro Max ఉండొచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ రెండు ఫోన్ల పేర్లను అధికారికంగా ధృవీకరించలేదు.
కొత్త Redmi Note 17 Pro సిరీస్‌లో అత్యంత కీలకమైన ఫీచర్ భారీ బ్యాటరీగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు 10,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యంతో రానున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ‘mAhster of strength’ అనే ట్యాగ్‌లైన్‌తో బ్యాటరీ సామర్థ్యాన్ని రెడ్‌మీ హైలైట్ చేస్తోంది. తమ అంతర్గత ల్యాబ్ పరీక్షల ప్రకారం లైట్ యూజేజ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు రోజులకు పైగా బ్యాటరీ బ్యాకప్ అందించగలదని కంపెనీ చెబుతోంది.
రెండు మోడళ్లలో ఆకట్టుకునే డిజైన్
కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం Redmi Note 17 Pro సిరీస్ ఫోన్లు ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. Redmi Note 17 Pro మోడల్‌ను నీలం రంగులో టీజ్ చేశారు.
అదే విధంగా Redmi Note 17 Pro Maxలో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉండొచ్చని సమాచారం. రెండు ఫోన్లలో పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ కుడివైపు భాగంలోనే ఉండనున్నాయి.
Snapdragon చిప్.. 512GB స్టోరేజ్
ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన Redmi Note 17 Pro Max వేరియంట్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో Snapdragon 6 Gen 5 ప్రాసెసర్ ఉండనుంది. 8GB LPDDR5x RAMతో పాటు గరిష్ఠంగా 512GB UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉండనుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర JPY 79,980గా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.47,900గా ఉంటుంది. అయితే భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే విషయాన్ని రెడ్‌మీ ఇంకా వెల్లడించలేదు.
అమెజాన్‌లో విక్రయాలు
Redmi Note 17 Pro సిరీస్‌కు సంబంధించిన టీజర్లను కంపెనీ ఇప్పటికే విడుదల చేస్తోంది. భారత్‌లో ఈ రెండు ఫోన్లు అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా 10,000mAh వరకు భారీ బ్యాటరీని తీసుకురావడం ద్వారా రెడ్‌మీ బ్యాటరీ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 15న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, బ్యాంక్ ఆఫర్లు తదితర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ బ్యాటరీతో వచ్చే ఈ కొత్త Redmi Note 17 Pro సిరీస్‌కు భారత మార్కెట్లో ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.