Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Release Date: బిగ్ ట్విస్ట్, సంక్రాంతి బరిలో ఉస్తాద్ భగత్ సింగ్......

Ustaad Bhagat Singh Release Date: బిగ్ ట్విస్ట్, సంక్రాంతి బరిలో ఉస్తాద్ భగత్ సింగ్… అంటే అవన్నీ పుకార్లేనా?

Ustaad Bhagat Singh Release Date: పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ హైప్ ఉంది. కారణం కాంబినేషన్. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కాగా గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దబంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇది పేరుకే రీమేక్. దర్శకుడు హరీష్ పవన్ ఇమేజ్ కి సరిపోయేలా ఒరిజినల్ కి భిన్నంగా తెరకెక్కించారు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ మేనరిజం, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఫీస్ట్.

12 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్ అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఇది తేరీ చిత్ర రీమేక్ అని సమాచారం. అయితే విడుదలైన ప్రోమో ఈ వాదనలకు భిన్నంగా ఉంది. నేపథ్యం కొత్తగా ఉంది. తేరీ రీమేక్ చేస్తున్నాడని హరీష్ శంకర్ ని దూషించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీజర్ చూశాక ఆయనకు క్షమాపణలు చెప్పారు. ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.

కాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎన్నికల అనంతరం చేద్దామని చెప్పారనే టాక్ వినిపించింది. దీంతో హరీష్ శంకర్ హీరో రవితేజతో మూవీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారంటూ పుకార్లు లేచాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న సమయానికి ముందే రానుందని సమాచారం.

దర్శకుడు హరీష్ శంకర్ కి కొన్ని కీలక సూచనలు చేసిన పవన్ కళ్యాణ్ సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయమన్నారట. ఏపీ ఎన్నికలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుందట. వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారట. కేవలం 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట. ఈ సమయంలో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలన్నారట. ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది. మిగిలిన షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయమన్నారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper