Gabbar Singh Re Release : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ట్రెండ్ లో తిరుగులేని హీరోలుగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నిలిచారు. మిగిలిన హీరోల సినిమాలు కూడా ఈ ట్రెండ్ లో రాణించాయి కానీ, రికార్డ్స్ మాత్రం కేవలం ఈ ఇద్దరి హీరోల సినిమాలకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ టైం డే 1 రికార్డు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్'(#GabbarSingh4k) ఖాతాలో ఉండగా, ఫుల్ రన్ రికార్డు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారి’ ఖాతాలో ఉంది. రీసెంట్ గానే మహేష్ బాబు కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచి కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ‘ఖలేజా'(#Khaleja4k) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : బొమ్మరిల్లు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో…ఇప్పటికి బాధపడుతున్నాడా..?
ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీ రిలీజ్ చరిత్రలో నార్త్ అమెరికా నుండి లక్ష డాలర్లకు పై గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ చిత్రం ఇదే. అయితే ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన ఈ చిత్రం, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మాత్రం మొదటి రోజు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పలేకపోయింది. కనీసం ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది ఈ చిత్రం. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి మొదటి రోజు ప్రీమియర్స్ కలిపి 7 కోట్ల 53 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ట్రేడ్ కి ఈ వసూళ్లను చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే అది మీడియం రేంజ్ హీరో మొదటిరోజు గ్రాస్ వసూళ్లతో సమానం అన్నమాట.
ఆ రేంజ్ వసూళ్లను ‘ఖలేజా’ లాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రం కూడా అందుకోలేకపోయిందంటే, ఇక ఏ సినిమా దానిని అందుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు వల్లనే కాలేదంటే ఈ రికార్డుని కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే బద్దలు కొట్టగలరు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున అతడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మామూలు రేంజ్ లో లేవు. ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిల్చిన ఈ చిత్రం కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు వసూళ్లను అధిగమిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ సినిమా కూడా మిస్ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమానే ప్రయత్నం చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.