Homeఎంటర్టైన్మెంట్Gabbar Singh Re Release: మరోసారి రీ రిలీజ్ కి సిద్దమైన 'గబ్బర్ సింగ్'..ఈసారి సరికొత్త...

Gabbar Singh Re Release: మరోసారి రీ రిలీజ్ కి సిద్దమైన ‘గబ్బర్ సింగ్’..ఈసారి సరికొత్త సన్నివేశాలతో..

Gabbar Singh Re Release: ఇప్పటి జనరేషన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనే పేరు ఎత్తితే ఎలా పూనకాలు వస్తాయో, సీనియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘గబ్బర్ సింగ్’ పేరు ఎత్తితే అలాంటి పూనకాలు వస్తాయి. పులి , తీన్ మార్ , పంజా వంటి వరుస హ్యాట్రిక్ డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అభిమానులు తమ అభిమాన హీరో మళ్లీ కం బ్యాక్ ఇస్తాడనే ఆశలు కోల్పోయారు. సరిగ్గా అలాంటి సమయం లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం వాళ్లకు ఒక అద్బుతమమైన జ్ఞాపకాలను ఇచ్చింది. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా వసూళ్లను బాహుబలి వచ్చేంత వరకు , ఒక్క స్టార్ హీరో కూడా ముట్టుకోలేకపోయారు.

దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అనేక సందర్భాల్లో స్పెషల్ షోస్ గా వేసుకొని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. 2024 లో , ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత , ఈ చిత్రాన్ని మరోసారి పవన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. మొదటి రిలీజ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో , రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అలాంటి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజే ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఈ రికార్డు ని మన టాలీవుడ్ లో ఒక్క హీరో కూడా ముట్టుకోలేకపోయారంటే , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు , ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేసాడు. విడుదల సమయం లో ఎడిటింగ్ లో తొలగించబడ్డ కొన్ని సన్నివేశాలను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాకు న్యూట్రల్ ఆడియన్స్ లో క్రేజ్ తక్కువే, 2024 లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ వల్ల ఆ రేంజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం పంజా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు , ఇలాంటి సమయం లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
Oktelugu Epaper