Homeఎంటర్టైన్మెంట్Gabbar Singh Re Release: ఒకే రోజు విడుదల కాబోతున్న 'ఒక్కడు', 'గబ్బర్ సింగ్'.. రీ...

Gabbar Singh Re Release: ఒకే రోజు విడుదల కాబోతున్న ‘ఒక్కడు’, ‘గబ్బర్ సింగ్’.. రీ రిలీజ్ హిస్టరీ లో అరుదైన ఘట్టం..

Gabbar Singh Re Release: టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మధ్య ఒకప్పుడు పోటీ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి కి ముందు టాలీవుడ్ రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి ఖాతాల్లోనే ఉండేవి. ఆ రేంజ్ డామినేషన్ చూపించారు. అయితే ఎప్పుడూ కూడా వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు లేవు. ఒక్కసారైనా అలా జరిగితే బాగుండును అని కోరుకున్న […]

Gabbar Singh Re Release: టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మధ్య ఒకప్పుడు పోటీ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి కి ముందు టాలీవుడ్ రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి ఖాతాల్లోనే ఉండేవి. ఆ రేంజ్ డామినేషన్ చూపించారు. అయితే ఎప్పుడూ కూడా వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు లేవు. ఒక్కసారైనా అలా జరిగితే బాగుండును అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది సాధ్యం అవ్వలేదు. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా , వీళ్లిద్దరి కెరీర్స్ లో కల్ట్ క్లాసిక్స్ గా పిలవబడే మురారి, జల్సా సినిమాలను ఒకే రోజున విడుదల చేశారు. ఈ రెండు సినిమాల్లో జల్సా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అంత కూడా , మురారి చిత్రానికి లేకపోవడం గమనార్హం.

ఆ రేంజ్ మార్జిన్ తో మహేష్ బాబు ని బీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి రీ రిలీజ్ సినిమాల మధ్య భారీ క్లాష్ జరగబోతుంది. ఈ నెల 26 వ తేదీన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు సెన్సేషనల్ హిట్ ‘ఒక్కడు’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఇద్దరి స్టార్ హీరోల కెరీర్స్ లో ఈ రెండు సినిమాలు కూడా మైల్ స్టోన్స్ లాంటివి. ఈ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి రేంజ్ మారిపోయింది. అలాంటి సినిమాలను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది?, ఏ చిత్రానికి ఎక్కువ గ్రాస్ వస్తుంది? అంటూ సోషల్ మీడియా లో లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ రెండు సినిమాలను వివిధ సందర్భాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.

‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని అనేక సందర్భాల్లో రీ రిలీజ్ చేశారు. చివరగా 2024 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయగా, ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిల్చింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి , ఒక్కటి కూడా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు రికార్డు ని బద్దలు కొట్టలేయకపోయాయి అంటే , ఈ రీ రిలీజ్ ఎంత క్లిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ఒక్కడు చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు రీ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు చిత్రాలను ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper