Homeఎంటర్టైన్మెంట్NTR And Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ పేరు 'డ్రాగన్' కాదా..? షాకింగ్...

NTR And Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ పేరు ‘డ్రాగన్’ కాదా..? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత!

NTR And Prashanth Neel: ‘వార్ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) , ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో మొదలైన చిత్రం చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా తగ్గాడు. భోజనప్రియుడు అయినటువంటి ఎన్టీఆర్, ప్రస్తుతం ఈ సినిమా కోసం కఠోరమైన డైటింగ్ లో ఉన్నాడు. దీన్ని బట్టీ ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ […]

NTR And Prashanth Neel: ‘వార్ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) , ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో మొదలైన చిత్రం చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా తగ్గాడు. భోజనప్రియుడు అయినటువంటి ఎన్టీఆర్, ప్రస్తుతం ఈ సినిమా కోసం కఠోరమైన డైటింగ్ లో ఉన్నాడు. దీన్ని బట్టీ ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. రెండు భారీ షెడ్యూల్స్ తర్వాత ప్రశాంత్ నీల్ కి బ్రేక్ తీసుకోవడం అలవాటు. గతం లో కేజీఎఫ్ సిరీస్ మరియు సలార్ చిత్రాలకు ఇదే విధంగా చేసాడు. ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా కొనసాగిస్తున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన స్క్రిప్ట్ ని మరింత బలంగా రాసుకుంటాడట. అయితే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్టు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రానికి మేమింకా ఎలాంటి టైటిల్ ని ఖరారు చెయ్యలేదు. మూడు, నాలుగు టైటిల్స్ ని అనుకుంటున్నాం. త్వరలోనే ఒక టైటిల్ ని ఖరారు చేస్తాము. ఆ టైటిల్ ని ఒక గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి, అభిమానుల సమక్ష్యం లో రివీల్ చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత రవి శంకర్. మరి అప్పటి వరకు ఈ సినిమా టైటిల్ పై సస్పెన్స్ వీడదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం లో నటించే మిగిలిన నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ఆ గ్రాండ్ ఈవెంట్ లోనే తెలియజేస్తారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper