418 Movie Review: హారర్ చిత్రాలకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు. థియేటర్ లో కూర్చొని డాళ్బీ అట్మాస్ సౌండ్ తో , ఒళ్ళు గగురుపొడిచే సన్నివేశాలు , సౌండ్ ఎఫెక్ట్స్ తో హారర్ చిత్రాన్ని చూస్తే కలిగే అనుభూతి వేరే లెవెల్ లో ఉంటుంది. కొంతమంది కి హారర్ చిత్రాలు చూడాలంటే చాలా భయం వేస్తుంది. కానీ థియేటర్ లో ఒక డిఫరెంట్ అనుభూతి పొందడం కోసం భయం వేసినప్పటికీ చూస్తుంటారు. అందుకే ఈ జానర్ లో ఒక సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కాసుల కనకవర్షం కురుస్తూ ఉంటుంది. అలాంటి హారర్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో నిండిపోయిన లేటెస్ట్ చిత్రం 418. ఈ చిత్రానికి కీర్తన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక నిర్మాతగా వ్యవహరించాడు. భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ విషయానికి వస్తే మధ్య తరగతి కుటుంబానికి చెందిన వివేక్ ని , అతని తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి మెడికల్ కాలేజీ లో చేర్పిస్తారు.. అయితే తానూ ఉండే హాస్టల్ గదిలో ఆత్మలు వెంటాడుతున్నట్టు , తనని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు వివేక్. అతనితో పాటు, అతని స్నేహితులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అనేక మిస్టీరియస్ సంఘటనలు చోటు చేసుకోవడం తో 418 అనే గదిని మూసేస్తారు. కానీ ఆ గది ప్రాంగణంలో గజ్జల చప్పుడు , విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. 15 ఏళ్ళ క్రితం దేవిక కు ఈ మెడికల్ కాలేజ్ లో జరిగిన అన్యాయం , ఎదురైనా సంఘటనల ఆధారంగా ఆమె చనిపోయి అక్కడే ఆత్మగా తిరుగుతుందని వివేక్ అనుకుంటాడు. కానీ అసలు ట్విస్ట్ తెలుసుకున్న తర్వాత షాక్ కి గురవ్వుతాడు , ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ముందుగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే , అనేక సన్నివేశాలు ప్రేక్షకులను సీట్లలో నుండి ఉలిక్కిపడేలా చేస్తాయట. ముఖ్యంగా సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉందని , థియేటర్స్ లో గూస్ బంప్స్ అనుభూతిని కలిగించాయని అంటున్నారు. ఇది రెగ్యులర్ హారర్ చిత్రం కాదని , ఇలాంటి కాన్సెప్ట్ తో ఈ మధ్య కాలం లో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. అయితే సింగిల్ పాయింట్ మీద ఈ చిత్రం స్క్రీన్ ప్లే నడవడం తో చాలా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ మొత్తం అయిపోయినప్పటికీ , మెయిన్ కథలోకి ఎంటర్ అవ్వరు , కేవలం హారర్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ , సౌండ్ ఎఫెక్ట్స్ తో నింపేశారు. కొన్ని సన్నివేశాలు నిజంగానే భయపెట్టాయి , మన టికెట్ కి న్యాయం జరిగింది అనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి కానీ , ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా తీశారు అనే అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే వేగంగా నడుస్తూ , భావోద్వేగ సన్నివేశాలు , ట్విస్టులు , హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నింపేస్తారు అనే అంచనాలతో ఉంటారు ప్రేక్షకులు. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో సెకండ్ హాఫ్ విఫలమైంది. చాలా యావరేజ్ టేకింగ్ తో డైరెక్టర్ నడిపించాడని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది. బలమైన స్టోరీ లేకపోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్. కానీ ఓవరాల్ గా ఒక యావరేజ్ హారర్ థ్రిల్లర్ మూవీ ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5/5..స్నేహితులతో కలిసి కొన్ని హారర్ థ్రిల్లర్ సన్నివేశాలను థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటే ఈ సినిమాకు వెళ్ళండి, మంచి టైం పాస్ అవుతుంది. ఈ సినిమా పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.