Homeఎంటర్టైన్మెంట్Salaar 2 Update: 'సలార్ 2' షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. పుట్టినరోజు ట్రీట్ అదిరింది!

Salaar 2 Update: ‘సలార్ 2’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. పుట్టినరోజు ట్రీట్ అదిరింది!

Salaar 2 Update: ప్రభాస్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాంటి చిత్రం ‘సలార్’. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇక ప్రభాస్ కి హిట్ రావడం కష్టమేనా అని అందరూ అనుకుంటున్న సమయం లో సలార్ చిత్రం వచ్చింది. అభిమానులకు గూస్ బంప్స్ థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ ఓటీటీ లో కూడా బ్రహ్మరథం పట్టారు. నెట్ ఫ్లిక్స్ లో […]

Salaar 2 Update: ప్రభాస్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాంటి చిత్రం ‘సలార్’. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇక ప్రభాస్ కి హిట్ రావడం కష్టమేనా అని అందరూ అనుకుంటున్న సమయం లో సలార్ చిత్రం వచ్చింది. అభిమానులకు గూస్ బంప్స్ థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ ఓటీటీ లో కూడా బ్రహ్మరథం పట్టారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఏకంగా రెండు సంవత్సరాలు ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియా లో కూడా సలార్ చిత్రం గురించి జెన్ జీ యూత్ ఆడియన్స్ ఇప్పటికీ వైబ్ అవుతూనే ఉంటారు.

అలాంటి చిత్రానికి సీక్వెల్ లేకపోతే ఎలా చెప్పండి ?. ప్రశాంత్ నీల్ సీక్వెల్ ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా, ‘డ్రాగన్’ మూవీ ముందుగా ప్రారంభించడంతో ఇప్పట్లో సీక్వెల్ ఉండదని అంతా అనుకున్నారు. పైగా ప్రశాంత్ నీల్ ఇకపై తన రైటింగ్ స్టైల్ మారుస్తానని , సలార్, కేజీఎఫ్ , డ్రాగన్ తరహా యాక్షన్ సినిమాలు కాకుండా, వివిధ జానర్స్ లో తన మార్కు ని చూపిస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం తో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్ 2’ పై ఆశలు వదిలేసుకున్నారు. కానీ కట్ చేస్తే నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ టీం శుభాకాంక్షలు తెలుపుతూ , త్వరలోనే ‘సలార్ 2’ షూటింగ్ మొదలు కాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానుల్లో సరికొత్త జోష్ ఏర్పడింది. ప్రస్తుతం ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్ , వచ్చే ఏడాది జూన్ నెల నుండి ‘సలార్ 2’ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి , అనుకున్న సమయం లో షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తే , మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. అయితే ‘సలార్’ చిత్రానికి 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ , బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఎబోవ్ యావరేజ్ గా నిల్చింది. దీంతో ఈ చిత్రం పై ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అవుతాయా లేదా అనే అనుమానం కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ లో ఉంది. వచ్చే ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సలార్ 2 నుండి గ్లింప్స్ వీడియో ఆశించవచ్చు , ఆ గ్లింప్స్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది , ఈ సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper