spot_img
Homeఎంటర్టైన్మెంట్Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున పై మేనల్లుడు సుమంత్ కంప్లెయింట్.. పారితోషికం విషయంలో గొడవలు.....

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున పై మేనల్లుడు సుమంత్ కంప్లెయింట్.. పారితోషికం విషయంలో గొడవలు.. అసలు ఏమైదంటే!

Akkineni Nagarjuna :  అక్కినేని కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నాగార్జున తర్వాత ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న హీరోలలో ఒకటి అక్కినేని సుమంత్. ఒకప్పుడు ఈయనకి వరుస సూపర్ హిట్స్ రావడం స్టార్ ఇమేజి కి అతి చేరువగా వచ్చాడు. కానీ ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో బాగా డౌన్ అయ్యాడు. కానీ సుమంత్ అంటే ఆడియన్స్ లో ఇప్పటికే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. సుమంత్ సినిమా అంటే కచ్చితంగా ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన వేరే హీరో సినిమాలో కీలక పాత్ర పోషించినా కూడా, ఆ సినిమాలకు బలం చేకూరుతుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడింది. అందుకు ఉదాహరణలు ‘సీతారామం’,’సార్’ వంటి చిత్రాలు. ఈ రెండు సినిమాల్లో సుమంత్ ప్రత్యేక పాత్రలు చేసాడు. ఆ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్స్ అయ్యాయి.

అదే విధంగా హీరో గా చేసే సినిమాలను కూడా ఆయన ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తనకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ చెడిపోకుండా, విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగార్జున గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ‘ప్రేమ కథ’. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాకి అప్పట్లో మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ చనిపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. ఈ చిత్రం తర్వాత నేను భూమిక తో కలిసి ‘యువకుడు’ అనే చిత్రం చేశాను. ఈ సినిమాకి నాగార్జున గారు నిర్మాత. కమర్షియల్ గా అప్పట్లో మంచి సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమాకి నాగార్జున గారు నాకు ఇస్తానన్నా రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదు. కట్టింగ్ల మీద కట్టింగులు చేసి చివరికి నా చేతిలో 5 లక్షలు పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్.

‘యువకుడు’ ,’సత్యం’,’గౌరీ’, ‘గోదావరి’, ‘గోల్కొండ హై స్కూల్’, ‘మళ్ళీ రావా’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన సుమంత్, ఈమధ్య కాలం లో స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ మంచి పేరుని తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు మాస్, యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలతో స్టార్ స్టేటస్ కి ఈయన చాలా దగ్గరగా వచ్చాడు. కానీ ‘గోదావరి’ చిత్రం తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లోపించింది. ఫలితంగా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి, మార్కెట్ పోయింది. ప్రస్తుతం ఈయన ‘అనగనగ ఒక రౌడీ’, ‘వారాహి’ వంటి చిత్రాల్లో హీరో గా నటిస్తున్నాడు. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలెక్టివ్ గా అడుగులు వేస్తున్న సుమంత్ కెరీర్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper