Nayanathara: మన సౌత్ సినిమాల్లో ఎక్కువగా హీరో, విలన్ మధ్య పోరు ఇద్దరు మగవాళ్ల మధ్యనే ఉండడం చూస్తూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో హీరో వెర్సస్ లేడీ విలన్ , అదే విధంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మేల్ విలన్స్ తో హీరోయిన్లు పోరాడడం వంటివి చూశాము . కానీ ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో , విలన్ గా కూడా ఒక లేడీ ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాము. అందులో సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ చిత్రం ఒకటి. ఇందులో మెయిన్ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి అరుదైన సందర్భం రానుంది. నయనతార ప్రధాన పాత్రలో ‘మూకుతి అమ్మన్ 2’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా రెజీనా కాసాండ్రా నటించింది.
ఈ చిత్రం లో రెజీనా , నయనతార మధ్య జరిగే పోరు వేరే లెవెల్ లో ఉంటుందని. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ గురించి సౌత్ లో కొన్నేళ్లు మాట్లాడుకుంటారని అంటున్నారు. రెజీనా కి విలన్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రెజీనా, ఇప్పుడు కేవలం విలన్ క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పటి వరకు ఆమె సెవన్, ఎవరు, చక్ర, విడాముయార్చి , జాట్ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకు ఆమె పోషించిన విలన్ క్యారెక్టర్స్ వేరు, ‘మూకుతి అమ్మన్ 2’ లో పోషించిన విలన్ క్యారెక్టర్ వేరు. సౌత్ లోనే మోస్ట్ పవర్ ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయే రేంజ్ క్యారెక్టర్ ఈ చిత్రం లో ఆమె చేసిందట.
2025 వ సంవత్సరం లోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ,VFX వర్క్ చాలా వారకు బ్యాలన్స్ ఉండడం తో వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వెండితెర పై నయనతార , రెజీనా మధ్య పోరాటం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.