Homeఎంటర్టైన్మెంట్Nayanthara: సల్మాన్ ఖాన్ కోసం బాలయ్య ని తక్కువ చేసిన హీరోయిన్ నయనతార..

Nayanthara: సల్మాన్ ఖాన్ కోసం బాలయ్య ని తక్కువ చేసిన హీరోయిన్ నయనతార..

Nayanthara: సౌత్ ఇండియా లో కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ చెక్కు చెదరని ఇమేజ్ తో, తరిగిపోని డిమాండ్ తో కొనసాగుతున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు నయనతార(Nayanatara). సాధారణంగా ఏ హీరోయిన్ కి అయినా పెళ్లి జరిగిన తారట సినిమా అవకాశాలు తగ్గిపోవడం వంటివి సర్వ సాధారణం. కానీ ఈ హీరోయిన్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అందం కూడా […]

Nayanthara: సౌత్ ఇండియా లో కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ చెక్కు చెదరని ఇమేజ్ తో, తరిగిపోని డిమాండ్ తో కొనసాగుతున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు నయనతార(Nayanatara). సాధారణంగా ఏ హీరోయిన్ కి అయినా పెళ్లి జరిగిన తారట సినిమా అవకాశాలు తగ్గిపోవడం వంటివి సర్వ సాధారణం. కానీ ఈ హీరోయిన్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. అందం కూడా చెక్కు చెదరలేదు. అందుకే ఈమెకు ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో హీరోయిన్ గా నటించి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న నయనతార, ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘వీర సింహా రెడ్డి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఇది. ముందుగా పీరియడ్ జానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు , కానీ బడ్జెట్ సహకరించకపోవడం తో మామూలు కమర్షియల్ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం నమ్మేది నయనతార ఇప్పుడు తప్పుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ముఖ్య కారణం స్టోరీ ని మార్చడం వల్లే అని కొంతమంది అంటుంటే , మరికొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సల్మాన్ ఖాన్ హీరోగా , వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమాకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించబోతుంది. సాధారణంగా పూజ కార్యక్రమాలకు హాజరు అవ్వడానికి ఇష్టపడని నయనతార , ఈ సినిమా పూజా కార్యక్రమానికి రావడం గమనార్హం.

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే నయనతార సల్మాన్ ఖాన్ సినిమా కోసమే బాలయ్య సినిమాని వదిలేసిందని రూమర్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం సాగుతోంది. బాలయ్య తో నయనతార గతంలో సింహా , శ్రీ రామరాజ్యం , జై సింహా వంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. మూడు సినిమాలు కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో బాలయ్య తో ఆమెకు మంచి సాన్నిహిత్య సంబంధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె సల్మాన్ ఖాన్ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపడానికి కారణం , ఆయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టే అని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper