Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ ,సుకుమార్ మూవీలో లేడీ సూపర్ స్టార్.. రెమ్యూనరేషన్...

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ ,సుకుమార్ మూవీలో లేడీ సూపర్ స్టార్.. రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిందంటే..

Ram Charan Sukumar Movie: ‘పెద్ది’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా నుండి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నటుడిగా రామ్ చరణ్ […]

Ram Charan Sukumar Movie: ‘పెద్ది’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా నుండి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నటుడిగా రామ్ చరణ్ ని ఈ చిత్రం తిరుగులేని స్టార్ గా నిలబెట్టింది. ఇప్పటికీ ఈ చిత్రం లోని రామ్ చరణ్ నటన ని కొలమానం గా పెట్టుకొని , యంగ్ హీరోలు ఆ తరహాలో నటించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్థాయి బెంచ్ మార్క్ ని సెట్ చేసిన చిత్రమిది. అలాంటి సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే , సాధారణంగానే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.

అలాంటిది ‘పుష్ప 2’ వంటి సక్సెస్ తర్వాత సుకుమార్ చేయబోతున్న సినిమా అంటే , మార్కెట్ లో ఈ సినిమా పై ఎలాంటి క్రేజ్ ఏర్పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈసారి గతం లో లాగా రూరల్ బ్యాక్ డ్రాప్ తో రావడం లేదు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఒక్క భాగం లో ఈ మూవీ స్టోరీ ని చెప్పడం కష్టం కాబట్టి , రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. డైరెక్టర్ సుకుమార్ పవర్ ఫుల్ క్యాస్టింగ్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంటుందట, ఆ క్యారెక్టర్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ని తీసుకోబోతున్నట్టు సమాచారం.

రీసెంట్ గానే సుకుమార్ నయనతార ని కలిసి ఈ సినిమాని స్టోరీ తో , ఆ క్యారెక్టర్ ని కూడా వివరించారట. నయనతార కి చాలా బాగా నచ్చడంతో , వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సుకుమార్ సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కి మొదటి నుండి మంచి ప్రాధాన్యత ఉంటూ వచ్చింది. ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘పుష్ప’ సిరీస్ లో అనసూయ కి ఎలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసారని , అది నయనతార కి చాలా బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాలో నటించడం కోసం ఆమె ఏకంగా 18 కోట్ల రూపాయిలు డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper