Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: సస్పెన్స్ కి తెరపడింది.. 'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ...

Bigg Boss 10 Telugu: సస్పెన్స్ కి తెరపడింది.. ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టాప్ 10 సెలబ్రిటీస్ వీళ్ళే..

Bigg Boss 10 Telugu:  సరిగ్గా మరో 15 రోజుల్లో , కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభం కానుంది. ఈ షో లోకి సామాన్యులను పంపే ప్రక్రియ లో భాగంగా రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ షో గురించే […]

Bigg Boss 10 Telugu:  సరిగ్గా మరో 15 రోజుల్లో , కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభం కానుంది. ఈ షో లోకి సామాన్యులను పంపే ప్రక్రియ లో భాగంగా రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ షో గురించే చర్చ. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , ఈ షో లోకి సెలబ్రిటీ క్యాటగిరీలో ఎవరెవరు రాబోతున్నారు అనే అంశం పై సోషల్ మీడియా లో రోజుకో వార్త ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ ఎట్టకేలకు ఈ షో లో పాల్గొనే సెలబ్రిటీలను ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.

ముందుగా ఈ షోలోకి రావడానికి అగ్రిమెంట్ చేసిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను లతో కలిసి ఇతను చేసిన స్కిట్స్ ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసింది. ఈయనకు టైటిల్ కొట్టేంత సత్తా కూడా ఉంది. అదే విధంగా ప్రముఖ యంగ్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈమె ‘రన్ రాజా రన్’ మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రాజు గారి గది 2’, ‘కృష్ణ & హిస్ లీల’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈమె కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అందుకే బిగ్ బాస్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరై , కెరీర్ ని రీ బిల్డ్ చేసుకునే ఆలోచనలో ఉంది.

అదే విధంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్ గా నటించిన టెంపర్ వంశి, సీరియల్ హీరోయిన్ సుహాసిని, జబర్దస్త్ నరేష్ వంటి వారు కూడా ఈ షో లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. అదే విధంగా యాంకర్ వర్షిణి కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతుంది. గత నాలుగు సీజన్స్ నుండి ఈమెని అడుగుతున్నారు , ఎట్టకేలకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ మాధురి రాథోడ్ ని కూడా బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా ప్రముఖ సీరియల్ హీరోయిన్ ఆషిక పదుకొనే , కావ్యశ్రీ, పల్లవి గౌడ లలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఓవరాల్ గా ఈ సీజన్ వేరే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper