Homeఎంటర్టైన్మెంట్Nani And Venky Atluri: వెంకీ అట్లూరి దర్శకత్వం లో నాని.. స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు..

Nani And Venky Atluri: వెంకీ అట్లూరి దర్శకత్వం లో నాని.. స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు..

Nani And Venky Atluri: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం, విపరీతమైన రీ షూట్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల […]

Nani And Venky Atluri: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం, విపరీతమైన రీ షూట్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ , లేదా డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాని ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నాని పుట్టినరోజు సందర్భంగా చేశారు. అయితే ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ ఆలస్యం అవ్వడం, సుజిత్ ఓజీ 2 చిత్రానికి షిఫ్ట్ అవ్వడం తో , ఈ సినిమా హోల్డ్ లో పడింది.

సుజిత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని ‘ఓజీ 2’ పైనే పెట్టాడు. అయితే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని ఏ సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘బ్లాస్ట్’ మూవీ డైరెక్టర్ సుభాష్ తో ఒక సినిమా ఒప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నాని డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య తో ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రం చేస్తున్న వెంకీ అట్లూరి, రీసెంట్ గానే నాని ని కలిసి ఒక స్టోరీ ని వినిపించారట. నాని కి ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడం తో , స్క్రిప్ట్ డెవలప్ చెయ్యమని చెప్పారట.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నట్టు సమాచారం. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న వెంకీ అట్లూరి కి ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్, నాని లాంటి హీరో తో పని చేస్తే కచ్చితంగా అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాలంటే కొన్ని నెలలు ఎదురు చూడక తప్పదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper