Homeఎంటర్టైన్మెంట్Bloody Romeo: సుజిత్ తో 'బ్లడీ రోమియో' క్యాన్సిల్.. మరో క్రేజీ డైరెక్టర్ ని లైన్...

Bloody Romeo: సుజిత్ తో ‘బ్లడీ రోమియో’ క్యాన్సిల్.. మరో క్రేజీ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన నాని..

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదల అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అంత నత్త నడకన ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత జూన్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఇక రీసెంట్ […]

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదల అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అంత నత్త నడకన ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత జూన్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఇక రీసెంట్ గా ఆగస్టు 21 న విడుదల చేస్తామని అధికారికంగా చెప్పారు, కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం లేదు. లేటెస్ట్ గా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ తేదీన కూడా వస్తుందా లేదా అనేది ప్రస్నార్ధకంగా మారింది.

దీంతో డైరెక్టర్ సుజిత్ తో ఆయన చెయ్యాలని అనుకున్న ‘బ్లడీ రోమియో’ చిత్రం కూడా అట్టకెక్కింది . భవిష్యత్తులో ఈ చిత్రం ఉండుందో లేదో తెలియదు కానీ , ప్రస్తుతానికి సుజిత్ ద్రుష్టి మొత్తం ‘ఓజీ 2’ మూవీ పై మరలించారు. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నాని ‘ది ప్యారడైజ్ ‘ తర్వాత చేసే సినిమాని కూడా రీసెంట్ గానే లాక్ చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ ఏడాది సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన ‘బ్లాస్ట్ జోన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుభాష్ రాజ్, నాని ని కలిసి ఒక స్టోరీ ని వివరించారట. ఆ లైన్ నాని కి అద్భుతంగా నచ్చడంతో , వెంటనే ఓకే చెప్పారని , ఈ ఏడాది లోనే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది.

రీసెంట్ గానే బ్లాస్ట్ చిత్రం ఓటీటీ లో విడుదల అవ్వగా , ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో సుభాష్ రాజ్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాని సినిమా హిట్ అయితే , రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఈయనకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper