Homeఎంటర్టైన్మెంట్Ramcharan - Balakrishna : రామ్ చరణ్ కినీరాజనాలు  పలుకుతున్న నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!

Ramcharan – Balakrishna : రామ్ చరణ్ కినీరాజనాలు  పలుకుతున్న నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!

రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసన తో కలిసి వచ్చాడు. శర్వానంద్ తో కాసేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత, వెనక్కి తిరగగానే బాలయ్య కనిపించాడు. రామ్ చరణ్ ఎంతో వినయం గా బాలయ్య బాబు చేతులు పట్టుకొని, నమస్కారం తెలిపాడు. అప్పుడు బాలయ్య బాబు ని ప్రేమతో ఆలింగనం చేసుకొని, బాగున్నావా చరణ్ అని అడుగుతాడు,

Ramcharan – Balakrishna : సోషల్ మీడియా లో గత కొంతకాలం నుండి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అసలు కలలో కూడా కలవరు, పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది అని అనుకునే రెండు ఫ్యాన్ బేసులు ఒకటి అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని  నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. బాబాయ్ – అబ్బాయి అంటూ కామెంట్స్ చేస్తూ రామ్ చరణ్ పై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు.నిన్నటి నుండి అయితే మరీను!.

నిన్న ప్రముఖ హీరో శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమం కి టాలీవుడ్ హీరోలందరూ వచ్చారు. రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసన తో కలిసి వచ్చాడు. శర్వానంద్ తో కాసేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత, వెనక్కి తిరగగానే బాలయ్య కనిపించాడు. రామ్ చరణ్ ఎంతో వినయం గా బాలయ్య బాబు చేతులు పట్టుకొని, నమస్కారం తెలిపాడు.

అప్పుడు బాలయ్య బాబు ని ప్రేమతో ఆలింగనం చేసుకొని, బాగున్నావా చరణ్ అని అడుగుతాడు, అప్పుడు చరణ్ బాగున్నాను అండీ అని సమాధానం ఇస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. బాలయ్య బాబు అంటే రామ్ చరణ్ కి ఎంత అభిమానం, గౌరవం అంటూ నందమూరి అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. మరో పక్క రామ్ చరణ్ ని పొగుడుతూనే జూనియర్ ఎన్టీఆర్ ని తిడుతున్నారు.

నిజమైన అభిమానం అంటే ఇలా ఉంటుంది, సొంత కుటుంబ ఫంక్షన్స్ కి హాజరు కాకుండా నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నీకేమి తెలుస్తుంది అభిమానం విలువ అంటూ ఎన్టీఆర్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టినప్పటి నుండి సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఒక రేంజ్ లో గొడవలు నడుస్తున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper