Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు… తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు గుర్తుండిపోతుంది. అప్పట్లో మన ఇండస్ట్రీ చెన్నై లో ఉండటం. మనకంటూ సెపరేట్ ఇండస్ట్రీ లేకపోవడంతో ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యాడట. అక్కడ మనకు గౌరవం లేదంటూ నాగేశ్వర రావు చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చి మనకోసం సపరేట్ ఇండస్ట్రీ ఉండాలని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి రావడంలో ఆయన చాలా వరకు కృషి చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అతని కొడుకు అయిన నాగార్జున సైతం ఇండస్ట్రీకి వచ్చి భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ మొత్తం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారని వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటూ ఉంటారని చాలా మంది చెబుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జునకి పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన చంద్రం సైతం ప్రొడ్యూసర్ గా మారాలనుకొని ఆ విషయాన్ని నాగార్జునకు చెప్పారట.
నాగార్జున సైతం అతన్ని ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఏ దర్శకుడుతో అయితే సినిమా చేయాలనుకుంటున్నావో ఆ దర్శకుడిని తీసుకురా నీ వెనకాల నేను ఉంటా నిన్ను ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యే విధంగా నేను ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారట.
దాంతో చంద్రం డైరెక్టర్ వి. సముద్ర ను నాగార్జున దగ్గరికి తీసుకెళ్లాడట. అప్పుడు నాగార్జున వి. సముద్ర దగ్గర ఉన్న కథని అడిగి తెలుసుకుని సినిమాని స్టార్ట్ చేయమని చెప్పారట. ఇంతకీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటంటే ‘పంచాక్షరి’… ఈ సినిమాలో అనుష్క మెయిన్ లీడ్ లో నటించింది.
అరుంధతి తర్వాత ఆమె చేసిన సినిమా కావడం వల్ల ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించలేదు. కానీ పర్లేదు అనిపించుకుంది. మేకప్ చంద్రం ప్రొడ్యూసర్ గా చేసిన మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. ఆయన వెనకాల ఉన్న నాగార్జున సైతం ఆ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి…