D Mart Shopping Tips: నిత్యావసరాలు.. ఇతర వస్తువులు కొనుగోలు చేసేవారు కచ్చితంగా డీమార్ట్ వెళ్తుంటారు. డి మార్ట్ లో తక్కువ ధరలో సరుకులు లభిస్తాయి అని చాలామంది నమ్ముతుంటారు. అందువల్లే అక్కడ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
మొదట్లో పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన డీమార్ట్.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. చిన్నచిన్న నగరాలలో కూడా తన శాఖలను ఏర్పాటు చేస్తోంది. డీ మార్ట్ లో తక్కువకు వస్తువులు లభిస్తాయని భావిస్తుంటారు. అందువల్లే అక్కడ సరుకులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు..
డీ మార్ట్ లో వీకెండ్.. పండుగల సమయంలో విపరీతంగా రద్దీ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ సరుకులు చేయడం అంత ఈజీ కాదు. అందువల్లే సరైన రోజు చూసుకొని.. సరైన సమయాన్ని అంచనా వేసుకుని అక్కడికి వెళ్తే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొన్ని రకాల ప్రత్యేక ఆఫర్లను కూడా పొందవచ్చు. ఆగస్టు నెలలో అనేక రకాలుగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పండగలు కూడా ఈ నెలలో అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ నెలలో డిమార్ట్ స్టోర్లలో విపరీతంగా రద్దీ ఉంటుంది అయితే ఈ నెలలో కూడా సౌకర్యవంతంగా షాపింగ్ చేయాలంటే.. ముందుగా స్టోర్ తెరిచిన వెంటనే షాపింగ్ చేయాలి. ఒకవేళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య స్టోర్ లోకి వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ శని, ఆదివారాలలో షాపింగ్ చేయాలి అనుకుంటే.. రద్దీని ఎదుర్కోవాల్సి ఉంటుంది..
కస్టమర్ల కోసం డీమార్ట్ యాజమాన్యం ప్రతీ ఏడాది ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటుంది. ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. రక్షాబంధన్.. వరలక్ష్మి వ్రతం.. వినాయక చవితి వంటి పండగలు ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల కిరణా వస్తువులు.. ప్లాస్టిక్ వస్తువులు.. కిచెన్ ఉత్పత్తులు.. గృహ ఉపకరణాలు వంటి వాటి మీద ఆకర్షణీయమైన తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ప్రాంతం ఆధారంగా.. స్టోర్ ఆధారంగా ధరలు మారుతాయి..
డి మార్ట్ లో షాపింగ్ చేయడానికి అంటే ముందు కొనుగోలు చేసే వస్తువుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. మరోవైపు ఇతర స్టోర్లలో కూడా ధరలను పోల్చి చూడాలి. ఆఫర్ వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుందా అనే అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా గడువులను కూడా సక్రమంగా పరిశీలించాలి.