Naa Anveshana Anvesh: హిందూ దేవుళ్లపై నోటికి వచ్చినట్టు మాట్లాడి, సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న అన్వేష్(Naa Anveshana) లో ఇసుమంత అయినా మార్పు వస్తుందేమో అని అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఇంత వ్యతిరేకత చూసిన తర్వాత ఎలాంటి మనిషి లో అయినా మనం మనిషిలాగా ప్రవర్తించడం లేదేమో , ఇకనైనా మారుదాం, లేకుంటే మనకు బ్రతుకు ఉండదు అనే చిన్న భయం ఉంటుంది. కానీ ఈ మనిషికి అలాంటి భయాలు ఏమి లేవు, భారత దేశం లో లేను, విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవ్వరూ ఏమి పీకలేరు , సజ్జనార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ , నన్ను అరెస్ట్ చేయలేరు అనే ధీమాతో ఇలా పిచ్చెక్కి మాట్లాడుతూ ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు నెటిజెన్స్. రీసెంట్ గానే గరికపాటి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్, ఇప్పుడు మరోసారి ఆయనకు కౌంటర్లు ఇస్తూ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రెండు మూడు రోజుల క్రితం, అన్వేష్ తనపై చేసిన కామెంట్స్ కి, పరోక్షంగా గరికపాటి కౌంటర్లు ఇచ్చాడు. ఇక యుద్ధం మొదలైంది , నా మీద అన్యాయంగా మాట్లాడితే నా అభిమానులు చూస్తూ ఊరుకోరు అని గరికపాటి అంటాడు. అందుకు అన్వేష్ మాట్లాడుతూ ‘గరికపాటి గారు, నా మీద మీరు యుద్ధం ప్రకటిస్తారా?, మీకసలు బుద్ధి ఉందా?, నన్ను ఎవరని అనుకుంటున్నారు అసలు , సాక్ష్యాత్తు బ్రహ్మదేవుడిని. నేనొక అవతార పురుషుడిని అనే విషయం రీసెంట్ గానే తెలిసిందే. మీరు విష్ణు మూర్తి అవతారం, చాగంటి గారు మహా శివుడు. మన ముగ్గురం త్రిమూర్తలు లాంటి వాళ్ళము మనం. త్రిమూర్తులు స్నేహితులు, స్నేహితుల మధ్య యుద్ధం ఏంటి?, మనం కారణం జన్ములము, ఈ దేశాన్ని ఉద్దరించడానికి మనం ఈ అవతారాలు ఎత్తాము’ అంటూ చాలా వ్యంగ్యంగా ఒక వీడియో ని విడుదల చేసాడు.
ఆ వీడియో ని మీరు ఈ ఆర్టికల్ చివర్లో చూడొచ్చు. ఈ వీడియో క్రింద కామెంట్స్ చూస్తే నెటిజెన్స్ లో ఇతగాడి పై ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది. నువ్వు దమ్ముంటే ఇండియా కి రావు, నిన్న విమానాశ్రయం నుండి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాము, నిన్ను బ్రతకనివ్వం అంటూ ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్కా బయ్యా సన్నీ యాదవ్ అనే మరో యూట్యూబర్ అన్వేష్ రెండు యూట్యూబ్ చానెల్స్ ని బ్యాన్ చేసేందుకు పడుతున్న కష్టాలు మామూలివి కావు. ఇప్పటికే అన్వేష్ ఛానల్ పై రెండు స్ట్రైక్స్ పడ్డాయి, ఇంకొక్క స్ట్రైక్ పడితే అసలు యూట్యూబ్ ఛానల్ పూర్తిగా తొలగిపోతుందని బయ్యా సన్నీ యాదవ్ తెగ ప్రచారం చేస్తున్నాడు. అతని కసి, పట్టుదల చూస్తుంటే అన్వేష్ రెండు యూట్యూబ్ ఛానెల్స్ పొయ్యేలాగానే ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.