Naa Anveshana Anvesh: ఈమధ్య కాలం లో జనాలకు విపరీతమైన కోపం తెప్పించిన వారిలో ఒకరు అన్వేష్. ‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానెల్స్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అన్వేష్, ఇప్పుడు ఆ పేరు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు. జనాలను రెచ్చగొట్టడమే ద్యేయంగా పెట్టుకున్నాడు. రోజుకి ఒక యూట్యూబ్ వీడియో చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తునే ఉన్నాడు. ఇతను ఎక్కడ ఉన్నా పట్టుకొని రావాలని, జైలు లో తోసి ఎముకలు విరిగిపోయేలా కొట్టాలని నెటిజెన్స్ కోరుకుంటున్నారు. ఒక రెండు రోజుల పాటు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ, ఆ తర్వాత మళ్లీ ఈ అంశంపై ఎలాంటి కదలిక రాలేదు. కానీ అతనేమో రెచ్చిపోతూనే ఉన్నాడు. ఏ జనాలు అయితే అతన్ని ఇలా పెంచి పోషించారో, ఇప్పుడు అదే జనాలను తప్పుబడుతూ రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘ ఈ గొడవ కారణం గా నేను 5 విషయాల్లో మారాలని అనుకుంటున్నాను. అందులో మొదటిది దానాలు చేయడం. నా బ్యాంకు బ్యాలన్స్ ఎక్కువ అయిపోవడం తో గత ఏడాది నేను బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షల చొప్పున 50 లక్షల వరకు ఆర్థికసాయం చేసాను. జనాల మీద నేను అంత ప్రేమ చూపిస్తే, ఇప్పుడు అదే జనాలు నన్ను తిడుతున్నారు. అందుకే ఇక పై నేను ఎవరికీ సహాయం చెయ్యాలని అనుకోవడం లేదు. నేను సంపాదించిన డబ్బు నాది మాత్రమే. అదే విధంగా గత ఏడాది వరకు నేను నా 8 యూట్యూబ్ చానెల్స్ కి నేనే పని చేసేవాడిని, కానీ ఇప్పుడు అందుకు ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. నెలకు అతనికి లక్ష రూపాయిల జీతం, ఇక మీదట నా 8 యూట్యూబ్ చానెల్స్ ని అతనే మైంటైన్ చేస్తాడు’.
‘నేను మారాలి అనుకుంటున్నా మూడవ అంశం, బూతులు మాట్లాడడం. అలా బూతులు మాట్లాడుతూ జెన్ Z పిల్లలకు బాగా దగ్గరయ్యాను. ఇక మీదట మంచి మాటలు మాట్లాడి అమ్మాయిలకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాను. ఇక నేను మార్చుకోవాల్సిన నాల్గవ అంశం టాస్కులు కట్టడం. నేను NRI గా ఉన్నాను, NRI గా ఉంటూ ఎవరైనా మన దేశానికీ టాక్సులు కడుతారా?, నేను దేశ భక్తితో కట్టాను. ఇప్పుడు ఏమి చేస్తానంటే నేను NRO అకౌంట్ చేస్తాను. అప్పుడు నేను టాక్సులు, జీఎస్టీ లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక నేను మార్చుకోవాల్సిన 5 అంశం, ఇంతకు ముందు నేను ఎవరి మాటలు వినేవాడిని కాదు , ఇప్పుడు బత్తాయిల మాటలు వింటాను, వాళ్లకు ఇక మీదట చుక్కలే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.