Naa Anveshana Anvesh: నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ లో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ పాపులారిటిని సంపాదించుకున్న యుట్యూబర్ అన్వేష్…ఆయన చాలామంది యూత్ కి ఆదర్శనీయంగా నిలిచాడు. కానీ ఆయన ఇప్పటివరకు చాలా కంట్రావర్సీ కామెంట్స్ చేసినప్పటికి ప్రతి ఒక్కరు అతనికి సపోర్టుగా నిలబడుతూ వచ్చారు. కానీ రీసెంట్ గా ఆయన గరికపాటి మీద, శివాజీ మీద హిందూ దేవుళ్లను ఉద్దేశించి చేసిన కామెంట్లకి ప్రతి ఒక్కరూ అతని మీద ఫైర్ అవుతున్నారు. యూట్యూబ్ లో మేము ఆదరిస్తే పైకెదిగిన అన్వేష్ కి డబ్బు గర్వం ఎక్కువగా పెరిగిపోయింది. ఎవరిని పడితే వాళ్లను విమర్శిస్తూ అణిచిత వ్యాఖ్యలు చేస్తుండటం సరైనది కాదు అంటూ ప్రతి ఒక్కరు అతన్ని విమర్శిస్తున్నారు. అలాగే తన చానెల్ ను అన్ సబ్స్క్రయిబ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు 2 లక్షల మంది అతన్ని ఆన్ సబ్స్క్రయిబ్ చేయడం తో దిగివచ్చిన అన్వేష్ గరికపాటికి, శివాజీకి అలాగే హిందూ దేవుళ్ళ మీద అనుచిత వాక్యాలు చేసినందుకు సారీ చెప్పాడు. అయినప్పటికి నెటిజన్లు మాత్రం ఆగడం లేదు. తనకు పొగరు ఎక్కువైపోయిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటూ అతన్ని ట్రోల్ చేస్తూ తన చానెల్ కి రిపోర్ట్ కొడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఒక పేరు సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడతామో అది మనకు మాత్రమే తెలుసు. అలాంటిది పేరు వచ్చిన తర్వాత ఒదిగి ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ మేటర్ ల మీద స్పందిస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం ఇప్పుడు అన్వేష్ కి అర్థమైంది…
కొందరు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అతను ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు సైతం క్లారిటీగా తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అన్వేష్ అలాంటి కామెంట్లు చేయడం సరైనది కాదు. ఇక దేశం గురించి కూడా ఆయన పలుసార్లు తీవ్రమైన విమర్శలైతే చేశాడు. దానిమీద కూడా అతనికి నెగెటివిటీ పెరిగిపోయింది…