Garikapati Narasimha Rao vs Naa Anveshana : ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అన్వేష్(Naa Anveshana) పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇతను చేసిన నీచమైన వ్యాఖ్యలకు సోషల్ మీడియా భగ్గుమంది. ఎవరైతే ఇతన్ని ఎంతో అభిమానించి యూట్యూబ్ లో అన్సారిస్తున్నారో, వాళ్ళే ఇప్పుడు ఇతని ప్రవర్తన, ఇతను చేసే వ్యాఖ్యలకు ఛీ కొడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేయకముందు ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ కి 25 లక్షల మంది యూజర్లు ఉండేవారు. కానీ వ్యాఖ్యల తర్వాత 21 లక్షలకు పడిపోయారు. అంటే గడిచిన రెండు మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది ఇతని ఛానల్ ని అన్ ఫాలో అయ్యారు అన్నమాట. హిందూ దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడమే కాకుండా, ప్రవచకర్త గరికపాటి నరసింహా రావు(Garikapati Narasimha rao) పై ఇతను చేసిన నీచమైన వ్యాఖ్యలు చూస్తే ప్రతీ హిందువుకి రక్తం మరిగిపోతాది.
గరికపాటి నరసింహా రావు గారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి అతనికి ఉన్నతస్థాయి కల్పిస్తూ ప్రవచాకర్తగా గుర్తింపుని ఇచ్చింది. అలాంటి వ్యక్తి పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు కదా, తగిన రీతిలో బుద్ధి చెప్తారు, ఇన్నాళ్లు కస్టపడి ప్రపంచం మొత్తం తిరిగి సంపాదించుకున్న యూజర్స్ మొత్తం వెళ్లిపోయేలా ఉన్నారు. దీంతో దిక్కు తోచని స్థితికి వెళ్లిపోయిన అన్వేష్, తానూ మాట్లాడిన మాటలకు వివరణ ఇస్తూ, ఏవేవో వీడియోలు చేస్తున్నాడు, కానీ జనాలు వాటిని పట్టించుకోలేదు. అయితే అన్వేష్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి చాగంటి కోటేశ్వరరావు నేడు స్పందించిన విధానం ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా చాగంటి ఇలాంటి వాళ్ళను పట్టించుకోడని, కచ్చితంగా అన్వేష్ కి కౌంటర్ ఇవ్వడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చాలా ఘాటుగా ఈ అంశం పై సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నేరస్తుడికి శిక్ష ని విధించడం కంటే, సమాజం అతన్ని ఛీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుంది’ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఏ మచ్చ లేని వారిపై నోరు పారేసుకోవడం, బురద జల్లడం వంటివి మంచిది కాదని, తనని అభిమానించే వారు ఇలాంటి వాటిని అసలు సహించరాని చెప్పుకొచ్చాడు. ధర్మానికి మద్దతుగా నిల్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ , ఇలాగే సభ్యత సమాజం పై తమ గళం విప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపుని ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఆయన అన్వేష్ పేరు ని ప్రస్తావించలేదు. జరిగిన ఘటనలను కళ్లారా చూస్తున్న ఆయన అన్వేష్ పేరు ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా, పరోక్షంగానే ఆయనకు కౌంటర్లు ఇస్తూ వచ్చాడు. మరి దీనిపై అన్వేష్ స్పందిస్తాడో లేదో చూడాలి.