Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby Movie: చిరంజీవి తో ఎలాంటి సినిమా చేయాలో బాబీ కి బాగా తెలుసా..?

Chiranjeevi Bobby Movie: చిరంజీవి తో ఎలాంటి సినిమా చేయాలో బాబీ కి బాగా తెలుసా..?

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఒక రకంగా చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ సక్సెస్ గా చెప్పుకునే సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ఒకటి కావడం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవిని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయం బాబీ కి బాగా తెలిసినట్టుంది. […]

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఒక రకంగా చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ సక్సెస్ గా చెప్పుకునే సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ఒకటి కావడం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవిని ఎలా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే విషయం బాబీ కి బాగా తెలిసినట్టుంది. అందుకే అలాంటి కథలతోనే చిరంజీవి దగ్గరికి వెళ్లి అతన్ని మెప్పించి మరి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాబీ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు…

గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాబీ లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. మరలాంటి దర్శకుడు చిరంజీవిని ఇప్పుడు ఎలా చూపించబోతున్నాడు. డిఫరెంట్ కోణంలో చూపిస్తాడా? లేదంటే రొటీన్ గానే చూపించి బోర్ కొట్టిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కూడా ఈ సినిమాలో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి తను కథ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కథని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే బాబీ చిరంజీవితో మరో సక్సెస్ ని సాధించడం పక్కానా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక చిరంజీవి తనకు ఎవరైతే సక్సెస్ లను అందిస్తారో వాళ్లకి మాత్రమే సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు.

నిజానికి చిరంజీవి తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్లెవరికి అవకాశం ఇవ్వడం లేదు. కారణం ఆయన చెప్పినట్టుగా సినిమాను చేస్తూ కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయగలిగే దర్శకులను మాత్రమే ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి బాబీ కే ఆయన ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper