Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే రాజమౌళి ఆ కథతో మూవీ చేస్తాడా..?

Chiranjeevi: చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే రాజమౌళి ఆ కథతో మూవీ చేస్తాడా..?

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. మెగాస్టార్ అనే ట్యాగ్ కి ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరించగలిగే ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం… ముఖ్యంగా చిరంజీవి […]

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. మెగాస్టార్ అనే ట్యాగ్ కి ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరించగలిగే ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం… ముఖ్యంగా చిరంజీవి సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అతని సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అందువల్లే చిరంజీవికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఆయన అందుకున్న అవార్డులే దానికి నిదర్శనం. ఇక ఇప్పుడు ఆయన కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు.

మరోసారి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. దర్శకదీరుడి గా పేరు సంపాదించుకున్న రాజమౌళి చిరంజీవితో ఒక సినిమా చేయడానికి గతంలో సన్నాహాలు చేసుకున్నాడు. చిరంజీవి డేట్ ఇస్తే చాలు తనతో అదిరిపోయే సినిమా చేస్తాను అంటూ గతంలో చెప్పిన రాజమౌళి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా అయితే రాలేదు.

ఆ తర్వాత రాజమౌళి పాన్ ఇండియా బాట పట్టి పెద్ద సినిమాలను చేస్తుండటం చిరంజీవి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైపోతుండడం వల్ల వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే మాత్రం రాజమౌళి చిరంజీవిని ఒక సమురాయ్ లాగా చూపించవారట. దానికి సంబంధించిన కథను కూడా తను రెడీ చేసి పెట్టుకున్నాడు.

అది కేవలం చిరంజీవితో మాత్రమే చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అయితేనే దానికి పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలరని రాజమౌళి భావించారట. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇక ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ తెలియజేయడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper