Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి ఆ దర్శకులతో సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

Chiranjeevi: చిరంజీవి ఆ దర్శకులతో సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి అక్కడ ఇమడలేక మళ్ళీ ఇండస్ట్రీ కి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మధ్యలో కొన్ని విజయాలు తన ఖాతాలో పడినప్పటికి అవి చిరంజీవి రేంజ్ సక్సెస్ లు కావని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు భారీగా వర్కౌట్ కావడం లేదు. దాంతో ఎలాగైనా మరోసారి భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి చిరంజీవి రేంజ్ ను చూపించే సినిమాలైతే పడడం లేదు… ఇక ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి ఈ సినిమాతో ఎలాగైనా సరే తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక గతంలో చిరంజీవి ఒక ఇద్దరు దర్శకులతో సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, మరొకరు శేఖర్ కమ్ముల కావడం విశేషం…

అయితే వీళ్ళిద్దరి డైరెక్షన్ లో తను సినిమా చేయడానికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ అనుకొని కారణాల వల్ల రెండు సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో శేఖర్ కమ్ముల చిరంజీవితో ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వెలువడ్డాయి. నిజానికి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక మాస్ కమర్షియల్ సినిమాని షేర్ కమ్ముల రాశారట.

ఆయన డైరెక్షన్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా వస్తే ఎలా ఉంటుందనేది చూడడానికి చాలామంది ఆసక్తి చూపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం గత మూడు సంవత్సరాల క్రితం చిరంజీవితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

కానీ చిరంజీవికి ఉన్న కమిట్మెంట్స్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పే సాఫ్ట్ కథ చిరంజీవికి పెద్దగా ఎక్కకపోవడం వల్లే ఆ కథని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మీదట త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గాని నటించే అవకాశం వస్తే మాత్రం మిస్ చేసుకోనని తప్పకుండా వాళ్లతో సినిమా చేస్తానని గతంలో పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Oktelugu Epaper