Homeఎంటర్టైన్మెంట్Allu Arjun sensational comments: 'మన శంకర్ వర ప్రసాద్' బ్లాక్ బస్టర్ కాదు...సంచలన కామెంట్స్...

Allu Arjun sensational comments: ‘మన శంకర్ వర ప్రసాద్’ బ్లాక్ బస్టర్ కాదు…సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…

Allu Arjun sensational comments: గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య దూరం పెరిగింది అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అంటూ ఇటు మెగా ఫ్యామిలీ హీరోలు, అటు అల్లు అర్జున్ ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు… ఇక అల్లు అర్జున్ మరోసారి చిరంజీవి మీద తన ప్రేమను చాటుకున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ […]

Allu Arjun sensational comments: గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య దూరం పెరిగింది అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అంటూ ఇటు మెగా ఫ్యామిలీ హీరోలు, అటు అల్లు అర్జున్ ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు… ఇక అల్లు అర్జున్ మరోసారి చిరంజీవి మీద తన ప్రేమను చాటుకున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ సినిమా మీద ట్వీట్ చేశాడు… సినిమాలో వింటేజ్ లుక్ లో చిరంజీవి అదరగొట్టాడు…

ఇది ‘ బ్లాక్ బాస్టర్ కాదు, బాస్ బస్టర్’ అంటూ అతని మీద ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి గారేంటి ఇలా ఉన్నారేంటి? ఈ ఏజ్ లో ఆ హుక్ స్టెప్ వేయడం ఏంటి? నిజంగా మైండ్ బ్లోయింగ్ డాన్స్ తో ప్రేక్షకులను అలరించాడు అంటూ చిరంజీవి మీద ప్రశంసలు కురిపించాడు. అలాగే నయనతార చాలా గ్రేషియస్ లుక్ లో అద్భుతంగా నటించింది.

వెంకీ గౌడ వెంకటేష్ ఉన్నతమైన నటనను కనబరిచాడు. తన మ్యూజిక్ తో భీమ్స్ సిసిరిలియో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు… కేథరిన్ థెరిసా సైతం తన పంచులతో నవ్వులు పూయించింది… ఇక డాషింగ్ ప్రొడ్యూసర్స్ అయిన సాహు గారపాటి, సుష్మిత కొణిదల చాలా అద్భుతంగా సినిమాని తెరమీద తీసుకొచ్చారు అంటూ అల్లు అర్జున్ చాలా గొప్పగా ట్వీట్ చేశాడు.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు రిపీట్… అంటూ అతని టాలెంట్ ని మెచ్చుకున్నాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేయడం పట్ల అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందింపజేసే విషయమనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper