NTR And Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న ప్రభాస్, మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఇద్దరు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య కలిసే కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే…వీళ్ళు పబ్లిక్ ఫంక్షన్స్ కి ఎక్కువగా అటెండ్ అవ్వరు. అలాగే వీళ్ళిద్దరూ తమ సినిమాలని చాలా నీట్ గా చేసుకుంటూ వెళ్తారు. ఇద్దరికీ సిగ్గు ఎక్కువ గానే ఉంటుంది. ఎలాంటి కాంట్రవర్సీ ల్లో ఇరుక్కోరు.
మొత్తానికైతే ఈ ఇద్దరు హీరోలు మిగతా హీరోల కంటే సపరేట్గా నిలుస్తున్నారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు… ఇక ఈ ఇద్దరికి యాంటీ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఇద్దరు హీరోలు నచ్చుతారు. వీళ్ళ సినిమాలను చూడడానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తాడు… ఇక వీళ్లిద్దరూ రాబోయే సినిమాలతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం విశేషం…
అల్లు అర్జున్ హీరోగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో సూపర్ మాన్ తరహా సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తన రేంజ్ మరింత మారుతుందనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
అయితే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కలిసే కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే… వీళ్ళిద్దరూ చాలా ఎనర్జీతో ఉంటారు. బయట ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్ గా మాట్లాడుతుంటారు. ఇద్దరు మంచి డ్యాన్సర్స్…ప్రతి ఒక్కరిని ఆట పట్టిస్తూ ఉంటారు. సినిమా చేస్తున్నప్పుడు సెట్ లో ఉండే ప్రతి ఒక్కరిని యాక్టివ్ గా ఉండే విధంగా వాళ్ళ మాటలతో సెట్ మొత్తాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ తో నింపేస్తూ ఉంటారు…