Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Vara Prasad Garu Collection: మన శంకర వరప్రసాద్ గారు..'OG' ని దాటడం...

Mana Shankara Vara Prasad Garu Collection: మన శంకర వరప్రసాద్ గారు..’OG’ ని దాటడం సాధ్యమేనా? 20 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

Mana Shankara Vara Prasad Garu Collection: ఈ సంక్రాంతికి మంచి అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ తో ముందుకు పోతుంది. 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 20 వ రోజు కూడా బుక్ మై షో […]

Mana Shankara Vara Prasad Garu Collection: ఈ సంక్రాంతికి మంచి అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ తో ముందుకు పోతుంది. 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 20 వ రోజు కూడా బుక్ మై షో యాప్ లో 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు, చాలా అరుదుగా ఇలాంటి థియేట్రికల్ రన్స్ ని చూస్తుంటాము. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం 4 మిలియన్ టికెట్ సేల్స్ బెంచ్ మార్క్ కి చాలా దగ్గరగా ఉంది. ఫుల్ రన్ లో ఆ మార్కుని అందుకుంటే సెన్సేషనల్ అనే చెప్పొచ్చు. ఇక 20వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మెజారిటీ సిటీస్ లలో ఈ చిత్రం నిన్న హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. ఇక 20 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 45.30 కోట్లు, సీడెడ్ నుండి 22.35 కోట్లు, ఉత్తరాంధ్ర నుండి 22.90 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా నుండి 15.40 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 9.74 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 11.05 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 10.80 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 6.67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 143 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 219 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఆంధ్రా, తెలంగాణ నుండి ఈ చిత్రానికి 13.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవర్సీస్ నుండి 19.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 286 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది కానీ, ఫుల్ రన్ లో ఈ చిత్రం ప్రతిష్టాత్మక 300 కోట్ల గ్రాస్ ని అందుకోవడం మాత్రం కష్టమే అని అంటున్నారు. మేకర్స్ మాత్రం ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు పోస్టర్లు విడుదల చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఓజీ ని అందుకోవడం కూడా ఇప్పుడు దాదాపుగా కష్టమే అని చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper